ఉన్నది ఒకటే జిందగీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడానికి అదే కారణం...తిరుమల కిషోర్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు అనేవి సర్వసాధారణమైన విషయం,  కొన్ని సమయాల్లో కథ విషయంలో అలాగే ఆ సినిమాలో తెరకెక్కించే విషయంలో అన్నీ సజావుగా సాగినట్లు అయితే ఆ సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి.  అలాగే కొన్ని సందర్భాలలో సినిమా  కథలో ఉన్న ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు పెద్దగా ప్రభావం చూపకుండా ఫెయిల్యూర్ ను అందుకుంటూ ఉంటాయి అయితే.  ఇలాగే కథలో ఒక చిన్న లోపం వల్ల తాను తెరకెక్కించిన సినిమా ఫెయిల్యూర్ అయినట్లు దర్శకుడు తిరుమల కిషోర్ తాజా ఇంటర్వ్యూ తెలియజేశాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు, ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించారు, ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదిన విడుదల కాబోతుంది,  ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ దర్శకుడు తిరుమల కిషోర్ అనేక విషయాలను తెలియజేశాడు.

 అందులో భాగంగా తిరుమల కిషోర్ ఉన్నది ఒకటే జిందగీ మూవీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు... ఉన్నది ఒకటే జిందగి మూవీ ని ఫ్రెండ్ షిప్ అనే పాయింట్‌తోనే తెర‌కెక్కించాల‌ని అనుకున్నాం,  ఆ పాయింట్ తగినట్టుగానే కంటెంట్ ను ఎలివేట్ చేసాము, అయితే మూవీకి  మేము అనుకున్న రిజల్ట్ రాలేదు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా ఫస్ట్ ఆప్ అందరికీ నచ్చింది,  ముఖ్యంగా ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కి అందరూ కనెక్ట్ అయ్యారు,   ఈ మూవీ లో అనుపమా పరమేశ్వరన్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో చినిపోతుంది అని చూపించాం. ఈ సినిమాలో ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా క‌నెక్ట్ కావ‌డంతో వాళ్లు డిస‌ప్పాయింట్ అయ్యారు,  అది సినిమా రిజల్ట్ చాలా ప్రభావం చూపింది, ఉన్నది ఒకటే జిందగీ మూవీలో  అనుపమ పరమేశ్వరన్ పాత్రకు దుఃఖ పూరిత‌మైన ముగింపును ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోయారు. ఉన్నది ఒకటే జిందగి మూవీ విషయంలో నేను చేసిన తప్పు అదే,  అందుకే నా మూవీ లలో ట్రేజిడి  ఎండింగ్ ఉండకూడదు అని నిర్ణయించుకున్నా, మూవీ లో ఎమోషన్స్ బలంగా ఉండాలే తప్ప  ట్రజిడి ఏండింగ్ ఉంటే వర్కౌట్ కాదు అని నిర్ణయించుకున్నట్లు   తిరుమల  కిషోర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: