బర్తడే: అనుపమ గురించి తెలియని మరికొన్ని విషయాలు..?

Divya
అనుపమ పరమేశ్వరన్ మలయాళం సినిమా ప్రేమమ్ తో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇక ఆ సినిమాతోనే ఈమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది.. ఈమధ్య ఆమె నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. అది అలా ఉంటే అనుపమ గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున ఈమె బర్తడే కనుక ఈ విషయాలను చూద్దాం.

1). అనుపమ కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి.. ఈమె 1996 ఫిబ్రవరి 18వ తేదీన సునీత-పరమేశ్వరన్ దంపతులకు జన్మించింది. తనకు నటన మీద ఎక్కువగా ఇష్టం ఉండడంతో తన చదువుని వాయిదా వేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2). అనుపమ మొదటి సినిమా ప్రేమమ్ కాగా తెలుగులో మాత్రం శతమానం భవతి సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకుంది.
3). తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగు మాత్రం బాగా మాట్లాడుతుంది.
4). అనుపమ తెలుగులో మాట్లాడటమే కాకుండా.. సొంతంగా తన సినిమాలకు తానే తెలుగులో డబ్బింగ్ చెబుతుందట.
5). అనుపమ పరమేశ్వరన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ 2020 నాటికి 60 లక్షలు పైగా ఉన్నట్లు సమాచారం.
6). హలో గురు ప్రేమ కోసం సినిమా షూటింగ్ లో.. అనుపమ ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.. అయితే అనుపమ ఈ విషయం పై స్పందిస్తే అలాంటిది ఏమీ లేదు కేవలం జ్వరము వచ్చి నేను పడిపోయాను అని తెలియజేసిందట.
7). అనుపమ బరువు పెరగకుండా ఉండేందుకు యోగాలు ,ధ్యానం వంటివి చేస్తుందట. చూడడానికి బొద్దుగా ఉండే అనుపమ కేవలం 56 కేజీలు మాత్రమే ఉన్నదట.
8). ఫిదా సినిమాలో సాయి పల్లవి, మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించిన పాత్ర అంటే తెగ ఇష్టమట.
9). ఇక రంగస్థలం సినిమా అవకాశం మిస్ చేసుకుందట అనుపమ.. అయితే సినిమా చూసిన తర్వాత సమంత కంటే నేను బాగా చేయలేనేమో అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: