వాలెంటెన్స్ డే ను అలా జరుపుకున్నాం... శృతి హాసన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ సినిమాలతో ఎంత బిజీ గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.  శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అనేక విషయాలను  అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ,  అది మాత్రమే కాకుండా తన సోషల్ మీడియా ద్వారా లైవ్ లోకి వచ్చి కూడా అనేక మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది.  ఇదిలా ఉంటే తాజాగా కూడా శృతి హాసన్ అభిమానులతో ముచ్చటించింది, అందులో భాగంగా ఎంతోమంది ఎన్నో ప్రశ్నలను శృతి హాసన్ ను అడిగారు.  

కానీ కొంతమంది రొటీన్ ప్రశ్నలను అడగగా,  కొంతమంది మాత్రం సరికొత్త ప్రశ్నలను శృతి హాసన్ ను అడిగారు.  అందులో శృతి హాసన్ కు కొన్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లు ఎదురయ్యాయి,  మీరు మూవీ ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫీలవుతారు అనే ప్రశ్న శృతి హాసన్ కు ఎదురవగా  శృతి హాసన్ మూవీ ఫెయిల్ అయితే బాధ పడతాను,  కానీ అదంతా జీవితంలో ఒక భాగమే, మన పని మనం కరెక్ట్ గా చేశామా అనేది ఇంపార్టెంట్,  సక్సెస్,  ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు కదా అంటూ శృతి హాసన్ సమాధానం ఇచ్చింది. మరొక నేటిజెన్ శృతి హాసన్ ను వాలెంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడిగాడు,  దానికి శృతి హాసన్, శాంతను హాజరిక కలిసి సమాధానమిస్తూ... ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి, రొమాంటిక్‌గా విష్ చేశాడు.. అని శాంతను హాజరిక గురించి శ్రుతి హాసన్ చెప్పింది,  దాని తరువాత ఇద్దరం కలిసి పాస్తా ను చేసుకొని తిన్నాం అని చెప్పుకొచ్చింది, ఇలా శృతి హాసన్ తాజాగా నెటిజన్లు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు  సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది, అలాగే బాలకృష్ణ సరసన ఒక సినిమాలో నటించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: