చిరంజీవి వాయిస్ విని ఏడ్చేసిన మేఘన...!!

murali krishna
2020లో సినిమా ఇండస్ట్రీని మోస్ట్ షాకింగ్‌కు గురి చేసిన మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అలాగే ఆయన చనిపోయే వారం ముందు.. అంటే జూన్ 7న కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ కేవలం 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడట.
పెళ్లైన రెండేళ్లకే భర్త చనిపోవడం.. ఆయన చనిపోయే సమయానికి భార్య 5 నెలల గర్భవతి కావడం కంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు.

ఈ రెండూ కన్నడ హీరో చిరంజీవి సర్జ భార్య మేఘన రాజ్ విషయంలో కూడా జరిగాయి. కన్నడ నాట స్టార్ హీరోగా అడుగులు వేస్తున్న సమయంలోనే కేవలం 35 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించాడట చిరంజీవి సర్జ. ఆయన మరణం కన్నడనాట అందరూ నంచలనం. చిరంజీవి సర్జా మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు మరియు కుటుంబం జీర్ణించుకోలేకపోతున్నారు.

చిరంజీవి సర్జా మృతి చెందిన సమయంలో మేఘన రాజ్ విషాదాన్ని దిగమింగుతూ ధైర్యంగా నిలబడిందట.. ప్రస్తుతం మేఘన రాజ్ కన్నడ బుల్లితెరపై డాన్సింగ్ ఛాంపియన్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోందట.. వాలెంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందni సమాచారం
మ్యారేజ్ తర్వాత తన భర్త తనకు గిఫ్ట్ గా ఇచ్చిన బహుమతులని అందరి ముందు గుర్తు చేసుకుందట.. నెక్ లెస్, హ్యాండ్ బ్యాగ్ ఇలా చిరంజీవి సర్జా మ్యారేజ్ యానివర్సరీ, వాలెంటైన్స్ డే సందర్భంగా ఇచ్చిన కానుకలు చూసి మరోసారి మురిసిపోయిందట.
ఇంతలో షోలో నిర్వాహకులు చిరంజీవి సర్జా పాత వాయిస్ ఆడియో ఒకటి ప్లే చేసారు. తనని విష్ చేస్తూ చెప్పిన మాటలకు మేఘన రాజ్ కన్నీరు ఆపుకోలేకపోయిందట.. కన్నీరు మున్నీరుగా విలపించిందట ఆమె.. ఈ సన్నివేశం షోలో ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేసిందట.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  బాగా వైరల్ గా మారింది.
2020 జూన్ 7న చిరంజీవి సర్జ గుండెపోటుతో కన్నుమూసాడు ఆయన వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే కన్నడలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఆయన ఎన్నో ఏళ్ల భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుండగా విధి పగ బట్టడంతో మరణించాడట.. చనిపోయే సమయానికి ఆయన చేతిలో అరడజన్‌కు పైగానే సినిమాలు ఉండటం విశేషం.
చిరంజీవితో పెళ్లి తర్వాత సినిమాలకు పాక్షికంగా బ్రేక్ ఇచ్చిందట మేఘన. అయితే ఇప్పుడు ఆయన చనిపోవడంతో కెరీర్‌పై మరోసారి ఫోకస్ చేసిందిట.వరస సినిమాలు చేస్తే కానీ ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేనని ఫిక్స్ అయిపోయిందిట ఆమె .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: