విజిల్ మహాలక్ష్మి గా మారిన బేబమ్మ.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్..!

Divya
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా తన కెరియర్ లో దూసుకుపోతున్న బేబమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు తన మొదటి దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో మొదటి విజయం అందుకోవడమే కాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కూడా అవకాశాలను కొట్టేస్తున్నాడు. మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఇప్పటికే బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న  ఈమె ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ది వారియర్ వంటి చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ది వారియర్ సినిమా నుంచి కృతి శెట్టి కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు సినిమా మేకర్స్. ఈ సినిమాలో హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా తమిళ డైరెక్టర్ లింగుస్వామి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలుగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఈ సినిమాలో కృతి విజిల్ మహాలక్ష్మి పాత్రలో నటించబోతోందని ఆమెకు సంబంధించిన పోస్టర్ ను  కూడా ఈ రోజు విడుదల చేయడం జరిగింది.. ఈ పోస్టర్ లో కృతి శెట్టి జీన్స్ ,టీ షర్ట్ వేసుకొని.. స్లింగ్ బ్యాగ్ తో చాలా కూల్ గా స్కూటీ నడుపుతున్నట్లు  మనం చూడవచ్చు. ఇకపోతే ఇందులో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో మనకు కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: