టీజర్ లతో సినిమాలపై అంచనాలను పెంచేస్తున్న శర్వానంద్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు,  ఆ తర్వాత హీరోగా ఎదిగాడు,  అయితే శర్వానంద్ హీరోగా  ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి వరుస విజయాలతో టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు.  అయితే ఇలా టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన శర్వానంద్ గత కొద్దికాలంగా మాత్రం ఆరెంజ్ విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో కాస్త స్లో అయ్యాడు అని చెప్పవచ్చు, శర్వానంద్ ఇప్పటికే పడి పడి లేచే మనసు,  రణరంగం,  జాను,  శ్రీకారం,  మహా సముద్రం వరస పరాజయాలతో డీలా పడిపోయాడు,  ఇది ఇలా ఉంటే  శర్వానంద్ ప్రస్తుతం ఒకే ఒక జీవితం,  ఆడవాళ్లు మీకు జోహార్లు అనే రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు, ఇందులో ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా,  ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టీజర్ ను కూడా చిత్రం విడుదల చేసింది, ఈ టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది, ఇలా ఈ సినిమా టీజర్ ల తోనే శర్వానంద్ ఈ రెండు సినిమాలపై అంచనాలను పెంచేశాడు,  ఇలా వరుస పరాజయాలతో బాక్స్ ఆఫీస్  దగ్గర డీలా పడిపోయిన శర్వానంద్ ఈ రెండు సినిమాలతో తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: