తమిళ్ తంబీలకు హామీ ఇచ్చిన అల్లుఅరవింద్...!

murali krishna
ప్రస్తుతం ఓటీటీ సీజన్ బాగా నడుస్తుంది. కరోనా వచ్చినప్పటి నుండి ఓటీటీ హవా అయితే బాగా పెరిగింది. తొలిసారి తెలుగులోను ఆహా అనే ఓటీటీ సంస్థని నెలకొల్పారు అల్లుఅరవింద్.అల్లు అరవింద్ వైవిధ్యమైన కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేస్తూ అందరిని కేక పెట్టిస్తున్నాడు.అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

'ఆహా' అధినేత అయిన అల్లు అరవింద్ ఆహాను తమిళంలో కూడా ప్రారంభించారట.. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఓ హోటల్‌లో నిర్వహించారని తెలుస్తుంది.. ఆడంబరంగా జరిగిన ఈ వేడుకకు నిర్మాత ఆర్‌.బి.చౌదరి, కలైపులి ఎస్‌.థాను మరియు దర్శకుడు కె ఎస్‌ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్‌ దంపతులు, నటుడు ఎస్‌.జె.సూర్య, ఖుష్భు అలాగే కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ పాల్గొన్నారట.

తమిళ నటుడు జయం రవి అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్‌ 'ఆహా' లోగోను ఆవిష్కరించారు. అనంతరం వైదికపై అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఆహా ద్వారా వందశాతం ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామని తమిళ ప్రేక్షకులకు హామీనిచ్చారు. ఆయన చెన్నైలోనే పుట్టి పెరిగినట్టు తెలిపారు. విద్యాభ్యాసం కూడా చైన్నైలోనే పూర్తయిందని అప్పటి రోజులను గుర్తు చేసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు.

20 ఏళ్ల కింద చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ ఇప్పుడు తిరిగి రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పుట్టింటికి వచ్చినంత ఆనందం ఇప్పుడు కలుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆహా కొత్త కొత్త సినిమాలను చేజిక్కించుకుంటూ.. మరోవైపు టాక్ షోతోనూ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమిళ నటుడు కార్తీ నటించిన 'సర్దార్' తమిళం మూవీ డిజిటల్ రైట్స్ ను కూడా 'ఆహా'ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. మరోవైపు తమిళంలోనూ ఆహాను లాంచ్ చేయడం పట్ల 'కార్తీ' ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆహా ఓటీటీ తమిళ్ కు ఆయన స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: