వామ్మో.. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా భారీ గానే చేస్తున్నారే!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ అప్పటి నుంచి వరుసగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తూ ఇప్పటివరకు ఒక్క పరాజయం లేకుండా అగ్ర దర్శకుడి దూసుకుపోతున్నాడు. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసిన ఆయన ఈ సినిమా తో అగ్ర దర్శకుడిగా మారడని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కొరటాల శివకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

ఆ విధంగా తక్కువ సినిమాలతోనే భారీ స్థాయి సినిమాలు చేసే దర్శకుడిగా పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి తో పాటు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా నక్సలైట్స్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉండగా కొరటాల శివ అల్లుఅర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టులు తారుమారు అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు కొరటాల శివ. ఈ చిత్రం కోసం ఎప్పటిలాగే సామాజిక స్పృహ ఉన్న ఓ అద్భుతమైన కథను రెడీ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు ఇది ఒక రివెంజ్ డ్రామా అని కూడా చెబుతున్నారు. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్క బోతుంది అంటున్నారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఎంతో గ్రాండ్ గా మొదలు కాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో తెరకెక్కుతోంది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: