ఒక్కసారి మొదలుపెడితే ఆపేదే లేదంటున్న పవన్ కళ్యాణ్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న  విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో ఒకటి హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయింది, అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి 'కొండపొలం' అనే సినిమా తెరకెక్కించడంతో హరిహర వీరమల్లు ఈ సినిమా వాయిదా పడింది.  అయితే కొన్ని రోజుల క్రితమే కొండపొలం సినిమా పూర్తి కావడంతో మళ్లీ హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో క్రిస్ జాగర్లమూడి ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇది ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమా మొదలు పెట్టాక మళ్ళీ పూర్తి అయ్యే వరకు మొత్తం డేట్స్ ఈ సినిమాకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు, ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25 వ తేదీన లేదా ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాల్లో కూడా నటించబోతున్నాడు అలాగే టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి  పవన్ కళ్యాణ్ ఇప్పటికే కమిట్ అయి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: