షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లతో ఆదిత్య చోప్రా ప్లానింగ్. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోనూ మల్టీస్టారర్ లు వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ పంథా ఎప్పటినుంచో సాగుతున్నా rrr సినిమా ప్రచారం తర్వాత ఎక్కువైంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో గెస్ట్ గా కనిపించడం సాధారణం. బాలీవుడ్ లో కూడా సల్మాన్,షారుక్, హృతిక్ లాంటి హీరోల సినిమాల్లో వేరే హీరోలుగా లేదా వీళ్లే వేరే హీరోల సినిమాల్లో గెస్ట్ గా వెళ్తూ ఉంటారు తాజాగా సల్మాన్,షారుక్, హృతిక్ లతో కలిసి భారీ సినిమాను ప్లాన్ చేయబోతున్నారు యష్ రాజు.
ప్రస్తుతం షారుక్ పఠాన్ గా, సల్మాన్ టైగర్ గా, హృతిక్ కబీర్ గా వారి వారి సినిమాల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఈ ముగ్గురితో ప్రముఖ డైరెక్టర్ నిర్మాత ఆదిత్య చోప్రా ఓ భారీ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నారు. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమా తరహాలో స్పై మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నారు.
గతంలో హృతిక్ వార్ సినిమా తో భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. వార్-2 సినిమాగా వీళ్ళ ముగ్గురితో సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్పై యూనివర్స్ సినిమాలో షారుక్ ఖాన్ పఠాన్ గా, సల్మాన్ టైగర్ గా, హృతిక్ కబీర్ గా కనిపిస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వీరి చేతిలో ఉన్న సినిమాలయ్యాక ఈ సినిమా ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా వస్తే ఇండియాలోనే మరో భారీ మల్టీస్టారర్ అవ్వనుంది. దీంతో బాలీవుడ్ లో అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే బాలీవుడ్ లో పెద్ద చరిత్ర సృష్టిస్తుందని చెప్పవచ్చు.