లక్ష్మీ ప్రణతికి అత్త మీద ఎంత ప్రేమో ?

VAMSI
ఫ్యాన్స్ వారి అభిమాన తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. వారి జీవిత భాగస్వాములు, అలాగే పిల్లలు వాళ్ళకి సంబందించిన విషయాలను, విశేషాలను తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇపుడు మీకోసం.
తారక్ కి లక్ష్మి ప్రణతితో 2011 మే 5 న అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మి ప్రణతి 1992 , మార్చ్ 18 న హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస రావు, మల్లిక దంపతులకు జన్మించారు. వీరిది చాలా ధనవంతుల కుటుంబం. తండ్రి శ్రీనివాసరావు రావు వేలాది కోట్లకు అధిపతి. ఎన్టీఆర్ కు ఈ సంబంధాన్ని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. తారక్ కి కట్నంగా లక్ష్మి ప్రణతి తండ్రి సుమారు అయిదువందల కోట్లకు పైగానే ఇచ్చినట్లు సమాచారం.
ఎన్టీఆర్ తో పెళ్లి అనంతరం లక్ష్మి ప్రణతి కూడా సెలబ్రిటీగా మారిపోయారు. కానీ ఈమె ఇప్పటి వరకు పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు, గొప్పింటి నుండి సెలబ్రిటీ ఫ్యామిలీ లోకి అడుగు పెట్టిన ఈమె చాలా మితభాషి. కానీ భర్త, పిల్లలు, అత్త షాలిని, దగ్గరి బంధువులతో మాత్రం చాలా సరదాగా ఉంటారు అని నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చెబుతుంటారు. లక్ష్మి ప్రణతికి కొత్త సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం అంట, అదీ మామూలు ఇష్టం కాదట థియేటర్లో కొత్త సినిమా వచ్చింది అంటే ఇక ఆ తరవాత ఇంట్లోని థియేటర్ లో కుటుంబ సభ్యులతో కలసి ఆ సినిమా చూడాల్సిందే. అందులోనూ భర్త తారక్ చిత్రాలు అయితే అస్సలు మిస్ కారు.
అత్తగారు షాలినికి గౌరవం ఇస్తూనే ఆమె తో చాలా సరదాగా ఒక ఫ్రెండ్ ల సన్నిహితంగా మెలుగుతారట లక్ష్మి ప్రణతి. భర్త ఎన్టీఆర్ ఆల్మోస్ట్ బిజీగా ఉంటారు కాబట్టి కుమారులను లక్ష్మినే ఎక్కువగా యంగేజ్ చేస్తుంటారు. వారిని బయటకు తీసుకువెళ్ళాలి అంటే అత్తగారు షాలినిని కూడా వారితో వెంట పెట్టుకుని వెళ్లనిదే ఇల్లు కదలరట లక్ష్మి ప్రణతి. ఆమెకు అత్తంటే అంత ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: