తమన్నా జీ.. కాస్త ఓవర్ గా లేదూ?
సీనియర్ హీరోలు దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు అటు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మరో సారి తమన్నా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తమన్నా గురించి అందరు చర్చించుకోవడానికి కారణం సినిమా కాదు.. తమన్నా హాట్ ఫోటో షూట్ కూడా కాదు. ఇటీవల తమన్నా వేసుకున్న డ్రెస్ కారణంగా వార్తల్లో నిలిచింది ఈ మిల్కీ బ్యూటీ.
ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా డ్రెస్సింగ్ పైన ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. షూటింగ్ నిమిత్తం ముంబై వచ్చింది. ఈ క్రమంలోనే టీ షర్టు చిరిగిన ప్యాంటు ధరించి ఎయిర్పోర్టులో ప్రత్యక్షమైంది తమన్నా. ఇక తమన్నా లాంటి హాట్ హీరోయిన్ కనిపించిన తర్వాత ఊరుకుంటారా. అక్కడ ఉన్న కెమెరామెన్స్ అందరూ కూడా తమన్నా అందాలను తన కెమెరాలో బంధించారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్. తమన్నా డ్రెస్సింగ్ మరీ ఓవర్ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది తమన్నా.