షావుకారు సినిమాలో ఏఎన్ఆర్ బదులు ఎన్టీఆర్ ను ఎందుకు తీసుకున్నారో తెలుసా..?

murali krishna
తెలుగు సినీ ప్రపంచంలో 'షావుకారు' సినిమా గొప్ప క్లాసిక్ సినిమాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.విజయా వారి నుండి వచ్చిన ఈ అద్భుతమైన సినిమా వెనుక అప్పట్లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందని తెలుస్తుంది.. మొదట ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావును హీరోగా పెట్టాలని ప్లాన్ చేశారట ఎల్.వి.ప్రసాద్. కానీ.. చక్రపాణికి అక్కినేనితో ఈ సినిమా చేయడం ఇష్టం లేదని 


అందుకే, ఎల్.వి.ప్రసాద్ షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు, చక్రపాణి పట్టుబట్టి షూటింగ్ జరగకుండా ఏదో రకంగా అడ్డు పడుతూ ఉండేవారట.అలా రెండు సార్లు జరిగిందని మరో నిర్మాత నాగిరెడ్డి మాత్రం షూటింగ్ గురించి ఎల్.వి.ప్రసాద్ ను అడుగుతూ ఉండేవారట.దాంతో ఓ రోజు ఎల్.వి.ప్రసాద్ సీరియస్ అవుతూ.. 'నాగిరెడ్డి గారు షూటింగ్ ఆలస్యం గురించి ముందు మీరు మీ చక్రపాణి గారిని అడగండి' అంటూ లేచి వెళ్లిపోయారట.నాగిరెడ్డికి ఏం జరుగుతుందో అర్థం కాక చక్రపాణి వైపు చూశారని తెలుస్తుంది..


చక్రపాణి నవ్వి.. 'ప్రతి కథకు ఒక ఆత్మ ఉంటుందని ఆ ఆత్మకు ఒక అభిరుచి ఉంటుందని అందుకే, ఆ అభిరుచిని బట్టి హీరోను ఎన్నుకోవాలి' అని చెప్పుకుంటూ పోయారట.నాగిరెడ్డి చిరాకు పడుతూ.. 'అది కాదు చక్రపాణి, ఇంతకీ అసలు విషయం చెప్పు'. 'ఈ సినిమాకు హీరోను మార్చాలి అని అన్నారట.. 'అదేంటి ? అక్కినేనికి ఏమైంది ? ఫామ్ లో ఉన్న హీరో కదా అని అన్నారట చక్రపాణి పైకి లేచి.. 'ఈ కథకు ఫామ్ లో ఉన్న హీరో కంటే.. కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి' అని నాగిరెడ్డి వైపు చూశాడట..


'అంటే రామారావును పెట్టుకుందామా ? అని నాగిరెడ్డి డౌట్ గా చూశాడట.. చక్రపాణి అవును అన్నట్టు తలూపాడు. కట్ చేస్తే.. షావుకారు జానకి - నందమూరి తారక రామారావు కలయికలో ఈ సినిమా షూటింగ్ మొదలైందట. శరవేగంగా పూర్తి చేసుకుని 1950న ఏప్రిల్ 7న విదుదలైన ఈ సినిమా దారుణంగా పరాజయం పాలైందని సమాచారం.. ఎందుకో అప్పట్లో ఈ క్లాసిక్ సినిమా కథ కూడా జనానికి పెద్దగా కనెక్ట్ కాలేదట.. కానీ గొప్ప పేరు అయితే వచ్చింది.

అయితే సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు గానీ, ఎన్టీఆర్ ను మాత్రం హీరోగా నిలబెట్టిందని . ఇక ఈ చిత్రకథలో మరో గమ్మత్తు ఏమిటంటే.. కథానాయకుడి పాత్ర విచిత్రంగా ఉంటుందట. ఎన్టీఆర్ కూడా ఎంతో బాగా నటించారు. ఇక సినిమా చూసిన ఏఎన్నార్ చక్రపాణి దగ్గర వచ్చి.. నిజమే అండి, ఫామ్ లో ఉన్న ఏఎన్నార్ కంటే, కథనే ఫామ్ లోకి తెచ్చే ఎన్టీఆర్ మిన్న' అని అక్కినేని నవ్వారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: