ఈ ముగ్గురు హీరోయిన్ ల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది గమనించారా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది మాత్రం మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకని ఆ తర్వాత కూడా వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతూఉంటారు, అలాంటి హీరోయిన్ లలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి, అయితే అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ఈ మధ్యనే విడుదలై మంచి విజయం సాధించింది, అయితే తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం థియేటర్ ల వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

 ఇది ఇలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా  మంచి విజయం సాధించింది, ఆ తర్వాత ప్రేమమ్ , శతమానం భవతి సినిమా సినిమాలతో అనుపమ పరమేశ్వరన్ వరుసగా మూడు విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే సమంత, నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది, ఆ తర్వాత బృందావనం, దూకుడు సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా మూడు విజయాలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: