బాక్సాఫీస్ పై రఫ్ఫాడించిన చిరు-బాలయ్య సినిమాలు.. ఎప్పుడంటే..!

MOHAN BABU
1991 సంవత్సరంలో బాలకృష్ణ చిరంజీవి గార్ల కెరియర్ గురించి తెలుసుకుందాం. ఇద్దరివీ చెరో మూడు సినిమాల చొప్పున రాగా వాటిలో ఎవరు ఎక్కువ శాతం హిట్లు కొట్టారో చూద్దాం. 1991 లో నందమూరి నట సార్వభౌమ వారసుడిగా బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తల్లిదండ్రులు. ఫిబ్రవరి 11న రిలీజ్ అయిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా బాలయ్య పక్కన చాలా అందంగా చూడ చక్కని జంటగా కనిపించి ఆకట్టుకున్నారు. తల్లిదండ్రుల పై ఎంతో ప్రేమ గల హీరో తన కుటుంబ సమస్యలు తీర్చేందుకు ఎలా పోరాడాడో అన్నది ఆకట్టుకుంటుంది. ఈ ఫ్యామిలీ పిక్చర్స్ చక్కని స్టోరీతో ఆడియన్స్ ను అలరించింది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావ్ అంటూ బాలయ్య పలికే డైలాగ్ థియేటర్ లోనే కాక బయట కూడా బాగానే పేలింది.

 ఇక చిరంజీవి చిత్రం విషయానికి వస్తే స్టువర్టుపురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో చిరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చక్కగా తన పాత్రలో ఒదిగి పోగా హీరోయిన్ గా కూడా ఇందులో విజయశాంతి నటించారు. అయితే ఈ మూవీ ప్రేక్షకాదరణకు నోచుకోక పరాజయాన్ని చూసింది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ అయింది. ఇక రెండో సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర. ఇది ఏప్రిల్ 10న విడుదలైంది. ఎన్టీఆర్ స్వీయదర్శకత్వంలో తానే నిర్మాణం వహించి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో సత్యహరిశ్చంద్రుడి గానూ, దుష్యంతుడి గానూ నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయాన్నే చూసింది. చిరు రెండో సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పోయింది.ఆ మూవీ నే గ్యాంగ్ లీడర్. ఇదే బాపినీడు డైరెక్షన్లో మే 9న రిలీజ్ అయిన ఈ మూవీలో చిరు స్నేహానికి,
ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఆకట్టుకుంటుంది. గ్యాంగ్ లీడర్ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇక బాలయ్య మూడో సినిమా విషయానికొస్తే బాలకృష్ణ ఈ సారి చరిత్ర సృష్టించేసారు. ఆదిత్య 369తో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ వహించిన ఈ మూవీ 1991 జులై 18న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది.

టైం మిషన్ ఆధారంగా నడిచే ఈ డ్రామాలో బాలయ్య ఒకానొక టైంలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించిన తీరు అమోఘం. ఈ సినిమాలో ఇళయరాజా పాటలకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక చివరగా చిరంజీవి మూడో సినిమాకి వస్తే ఇది కూడా సేమ్ టు సేమ్ అలాంటి హిట్టే అందుకుంది. ఆ సినిమానే రౌడీ అల్లుడు. ఇందులో చిరంజీవి మాస్ రోల్ లో ద్విపాత్రాభినయం చేసి నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దివ్యభారతి, శోభన హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఇలా 1991లో బాలయ్య, చిరంజీవి చెరో రెండు హిట్లు చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: