శ్రీవల్లి పాటకు కాలు కదిపిన సురేష్ రైనా..!

murali krishna
ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను అయితే సాధించింది.

ఇక ఈ మధ్యనే ఓటిటి లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ కూడా అనిపించుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు గడుస్తున్న పుష్ప మానియా ఇంకా తగ్గడం లేదట.ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశం మాత్రం మ్యూజిక్.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం శ్రోతలను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి పాట క్రేజ్ రోజురోజుకూ మాత్రం పెరిగి పోతుంది. గత రెండు రోజుల నుండి పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు సంబంధించిన వీడియోలు అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ఈ పాటకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అయిన సురేష్ రైనా పుష్ప శ్రీవల్లి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని అలరించాడు. తాను ఇటీవలే సినిమా చూశానని అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని సురేష్ రైనా కొనియాడారట.. అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ.. శ్రీవల్లి పాటకు ఏదో ఇలా డ్యాన్స్ చేశా అంటూ తెలిపాడట.. ప్రెసెంట్ సురేష్ రైనా వేసిన ఈ స్టెప్పులు మాత్రం నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియో చూసి సురేష్ రైనా వేసిన స్టెప్పులు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: