అక్కడ సూపర్ స్టార్ గా రాణిస్తున్న మన తెలుగు వాడు ఎవరో తెలుసా

D.V.Aravind Chowdary
భారత చలనచిత్ర పరిశ్రమలో ఏంతో మంది నటులు తమ మాతృ ఇండస్ట్రీలో కంటే పక్క ఇండస్ట్రీల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. ఈ విషయంలో ముఖ్యంగా హీరోయిన్స్ బాగా ముందున్నారు.పాతతరం నుండి ప్రస్తుతం వరకు దక్షిణాది కి చెందిన ఏంతో మంది హీరోయిన్స్ బాలీవుడ్ లో అగ్రకథానాయికలుగా వెలుగొందిన విధితమే. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో  ఎక్కడ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయో అక్కడ వాలుతున్నారు. 

మన తెలుగు వారు తొలి నుంచి సినీ ప్రియులు. తినడానికి తిండి గింజకూ కరువు ఉన్న సినిమాల మాత్రం చూడకుండా ఉండలేరు కేవలం సినిమాలు చూడటం మాత్రమే కాదు నటన మీద కూడా చాలా ఆసక్తి చూపుతారు. అందుకే  ఒక తరం లో చాలామంది సినిమాల్లో నటించడమే ధ్యేయంగా పెట్టుకొని ఊళ్ళ నుండి అప్పట్లో చెన్నై, హైదరాబాద్ నగరాల్లో వాలేవారు, ఇప్పటికి వాలుతున్నారు. 

ప్రస్తుత తరంలో మన తెలుగు వారు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ , శాండిల్ వుడ్ ఇండస్ట్రీ లలో అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం బిజీ నటులుగా ఉన్నారు. అలాగే, ఒరిస్సా చిత్ర పరిశ్రమ ఒలీవుడ్ లో సైతం మన తెలుగు వాడు సూపర్ స్టార్ గా ఎదిగి ఆ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి వచ్చాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా ? తెలుసుకోవాలని ఉంటే క్రింద చదవండి. 

సవ్యసాచి మిశ్రా..... ఈ పేరు వింటే ఒరిస్సా , బెంగాలీ యువత కు పూనకం వస్తుంది.సూపర్ స్టార్ ఆఫ్ ఒలీవుడ్ బిరుదును సొంతం చేసుకున్న తొలి నటుడు. సవ్యసాచి మన తెలుగు వాడే అతని పూర్వీకులు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి చెందిన వాళ్ళు, బ్రతుకు తెరువు కోసం ఒరిస్సా వెళ్లి స్థిరపడ్డారు. తండ్రి సురేంద్ర ప్రసాద్ మిశ్రా సివిల్ సెర్వెంట్ గా పని చేసి పదవీవిరమణ పొందారు, తల్లి సుష్మ మిశ్రా ఒరియా రచయిత. 

సవ్యసాచి చిన్నతనం నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది అందుకు కారణం మన తెలుగు సినిమాలే, ప్రతి సంవత్సరం ఎండకాలం సెలవుల్లో అనకాపల్లి వచ్చి తెలుగు సినిమాలు చూసేవాడు అంట. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇన్ఫోసిస్ లో కొంత కాలం పనిచేసిన సినిమాల మీద ఆసక్తి తో జాబ్ వదిలేసి తొలుత మోడలింగ్ చేస్తూ పలు మ్యూజిక్ వీడియోస్ లో నటించేవాడు. 

సవ్యసాచి హీరోగా 2007 లో తెలుగు చిత్రం ఆర్య కు రీమేక్ గా వచ్చిన పగలా ప్రేమి చిత్రం ఘనవిజయం సాధించడంతో ఒలీవుడ్ లో తన హావా మొదలైంది. ఆ తరవాత నటించిన పలు చిత్రాలు ఘనవిజయాలను సాధించడంతో ఒలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. కేవలం ఒరిస్సా కే పరిమితం కాకుండా పంజాబీ, భోజ్ పూరీ, బెంగాలీ చిత్రాల్లో కూడా నటిస్తూ తన మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. 

 అన్నట్లు సవ్యసాచి తెలుగు లో రెండు సినిమాల్లో నటించాడు. అవి నిరంజనం , సీతారాముల కల్యాణం చూద్దాం రారండి. ప్రస్తుతం ఒలీవుడ్ లోనే కాకుండా తమిళ , తెలుగు భాషల్లో కూడా నటిస్తున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు చేయడమే తన లక్ష్యం అని చెప్పుకొస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: