ఈ సినిమాలు పోయినా హీరోలకు మంచి పేరొచ్చింది!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంక్రాంతి కానుకగా మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బంగార్రాజు చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇప్పుడు విడుదలైన సినిమాల్లో ఇదే కాస్తో కూస్తో పెద్ద సినిమా కావడంతో తెలుగు ప్రజలందరూ ఈ సినిమాకు వెళ్లి ఈ చిత్రానికి భారీ విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లను కూడా అందించారు. ఆ విధంగా నాగార్జున సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకొని మంచి పని చేశాడు. ఇది అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషప్డుతుంది అని చెప్పవచ్చు. 

ఇక ఈ సినిమాతో పాటే దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించడంతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేసింది ఈ చిత్రం. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా ఈ హీరో కి సంబంధించిన నటనను అందరూ మెచ్చుకోవడం మొదలు పెట్టారు. కథ పై కొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అని అందరూ చెప్పే మాటే అయినా ఉన్నంతలో ఈ హీరో మంచి నటనను కనబరిచి మంచి డాన్సర్ అని కూడా నిరూపించుకున్నాడు. పెద్ద హీరోయిన్ తో నటిస్తున్నాడనే భయం కూడా ఆయనలో కనిపించలేదని వారు చెబుతున్నారు. 

ఇక గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకులను మెప్పించక పోయినా కూడా ఒక హీరో కు ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలి ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ కు ఇచ్చారు అని చెప్పవచ్చు. నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్ సరసన నటిస్తున్న అశోక్ సినిమాలో ఏమాత్రం బెదురు లేకుండా నటించి కొత్త వాడు అనే అనుమానం రాకుండా నటించాడు. అలా ఈ ఇద్దరు హీరోలు కూడా మొదటి సినిమా అయినా సినిమానే అయినా తమ నటనతో డాన్స్ తో పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా అలరించి హీరోలుగా నిలదొక్కుకున్నారు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: