అయ్యో!నాగచైతన్య మళ్ళీ దొరికేసాడుగా..!

murali krishna
అక్కినేని నాగ చైతన్య వివాదాల జోలికి అస్సలు వెళ్లడు. ఆయన తాజాగా బంగార్రాజు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని తెలుస్తుంది.

అయితే ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాగ చైతన్య చేసిన కొన్ని చిలిపి పనులు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఈ చిత్ర బృందం మ్యూజికల్‌ నైట్స్‌ అనే ఈవెంట్‌ని కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై నాగార్జున మాట్లాడుతుండగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ చోటుచేసుకుందని తెలుస్తుంది.మ్యూజిక్‌ గురించి అనూప్‌ రూబెన్స్‌ని నాగార్జున ప్రశంసిస్తుంటే.. సడెన్‌గా నాగ చైతన్య వెనక్కి తిరిగి హీరోయిన్‌ దక్ష నాగర్కర్‌ వైపు చూశాడట.

ఆ సమయంలో దక్ష కూడా కనుబొమ్మలు ఎగరేస్తూ కొంటెగా నవ్విందట.దీంతో చైతూ కూడా తెగ సిగ్గుపడిపోయాడు. దీనికి సంబంధించిన క్యూట్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ కాగా, దీనిపై ఎన్ని రకాల మీమ్స్ పుట్టుకొచ్చాయో మనం చాలానే చూసి ఉంటాం.ఇక చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసి మంచి హిట్ కొట్టిన నాగార్జున ఇటీవల సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశాడు. అందులో నాగ చైతన్య, కృతి శెట్టి ఏదో మాటల్లో నవ్వుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ తెగ అవుతోంది. దీనిపై పలు రకాల మీమ్స్ కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

తండ్రి పక్కన ఉన్నా కూడా చైతూ అస్సలు తగ్గట్లేదుగా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి మరియు బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా ఏమి కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు కూడా అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం సినిమా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ మరియు కృతిశెట్టిలతో పాటు 8మంది హీరోయిన్లు సందడి చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తానికి నాగార్జున సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ హ్యపీ మూడ్‌లో ఉన్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: