అఖిల్ సినిమా కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న సురేంద్రరెడ్డి..!

murali krishna
మొత్తానికి అక్కినేని అఖిల్ అయితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాడు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో కొత్తగా చెప్పనవసరం లేదు.

ఇంతకు ముందు వరకు వరుసగా మూడు సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అయిన విజయం చూస్తాడా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే ఈ సినిమాకు మొదట కాస్త నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. చాలా రొటీన్ కమర్షియల్ సన్నివేశాలు ఉన్నాయని సినిమాకు అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఏమీ రావని కూడా అనేక రకాల కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ దసరా పండగ సీజన్ లో మిగతా సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో అఖిల్ చాలా ఈజీగా బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకున్నాడట.

ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మంచి వసూళ్లు అయితే అందుకుందని తెలుస్తుంది.. బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.. ప్రస్తుతం ఆ దర్శకుడు గీతా ఆర్ట్స్ లో నే మరొక పెద్ద హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.ఇక అఖిల్ అక్కినేని ఐదవ సినిమా ఏజెంట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా స్క్రిప్ట్ లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అఖిల్ ఒక పవర్ఫుల్ గూడచారి కనిపించబోతున్నట్లు వార్త వినిపిస్తుంది.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని నిర్మాతలు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చాలా భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం.దర్శకుడు సురేందర్ రెడ్డి గతంలో ఎలాగైతే ఫుల్ యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్నాడో ఇప్పుడు ఏజెంట్ సినిమాతో కూడా అంతకు మించి ఉన్నట్లుగా ఆకట్టుకుంటాడని స్టైలిష్ ఎలివేషన్స్ తో అఖిల్ ను ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ కథని అందించాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. అసలైతే సినిమా గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారట కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన సినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని తెలుస్తుంది.

ఇటీవల సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి వాయిదా పడింది. ఇక షూటింగ్ కి మళ్లీ బ్రేక్ రావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ గ్యాప్ లో సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం.. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాల విషయంలో సురేందర్ రెడ్డి మరోసారి కథారచయితతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.. అఖిల్ ను ఈ సినిమాలో ఎలాగైనా విభిన్నమైన స్టైల్ లో చూపించాలి అని యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తంలో హైలెట్ గా ఉండాలి అని సురేంధర్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది.అందుకే దొరికిన గ్యాప్ లోనే ప్రతి షాట్ కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: