బాలయ్యకు పోటీగా ఆ స్టార్ హీరో దిగుతున్నాడుగా..!

murali krishna
తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదంను ఆహా ఓటీటీ బాగా అలవాటు చేస్తోంది. ప్రతి ఒక్క తెలుగు వారి ఇంట్లో ఉంటున్న ఆహా ఇప్పటికే బాలయ్య అన్‌ స్టాపబుల్‌ తో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుందట..

బాలయ్య ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్‌ స్టాపబుల్‌ మొదటి సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.. మొత్తం 15 ఎపిసోడ్స్ తో ఈ సీజన్‌ ను ముగించబోతున్నట్లుగా సమాచారం.ఈ సమయంలోనే బాలయ్య షో కు ఏమాత్రం తగ్గకుండా పై పెచ్చు బాలయ్య షో కు పోటీ అన్నట్లుగా విక్టరీ వెంకటేష్‌ తో ఒక షో ను చేయించేందుకు ఆహా టీమ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి..విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా టీమ్‌ వారు ఒక సరికొత్త గేమ్‌ షో ప్లాన్ చేస్తున్నారట.

వెంకటేష్ తో చేసేందుకు గాను దానిని ప్లాన్‌ చేస్తున్నారట. వారు చేస్తున్న ఈ గేమ్‌ షో కు ఇప్పటికే వెంకటేష్‌ ఓకే చెప్పడం కూడా జరిగినట్లు సమాచారం.. ప్రముఖ స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ కలిసి ఈ షో లో కనిపించబోతున్నారని తెలుస్తుంది.. బాలయ్య మరియు ప్రముఖులు కలిసి చేసిన అన్‌ స్టాపబుల్‌ కు మంచి రేటింగ్‌ కూడా వచ్చింది. అందుకే వెంకటేష్ తో ఆహా వారు ఇంకో భారీ షో ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. హాట్‌ స్టార్‌ లో బిగ్‌ బాస్ ఓటీటీ ఎలా అయితే రాబోతుందో కాస్త అటు ఇటుగా వెంకటేష్ తో అదే తరహా లో ఈ షో ను నిర్వహించబోతున్నట్లుగా వార్త అందుతోంది.వెంకటేష్ కు ఉన్న ఆసక్తి ఏంటో తెలుసుకుని అల్లు అరవింద్ ఆ షో ను ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం.వెంకటేష్ ఆలోచనలు కూడా తీసుకుని షో ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


మొత్తానికి ఈ షో ను అల్లు అరవింద్ భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తుంది.ఆహా కు మై హోమ్స్ రామేశ్వరరావు నిధులు భారీగా ఖర్చు చేస్తున్నాడట.. కనుక కోట్లు కుమ్మరించి షో లను అల్లు అరవింద్ చేస్తున్నాడనే వార్త వినిపిస్తుంది. ఎలా చేస్తేనేం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌ టైన్ మెంట్ అయితే దక్కుతుంది కదా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆహా ద్వారా వచ్చే ఆదాయం కన్నా పెడుతున్న పెట్టుబడి భారీగా ఉందని అయితే భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని ఆహాకు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లుగా చెబుతున్నారట.అల్లు అరవింద్ ఏం చేసినా కూడా చాలా ప్లాన్‌ తో చేస్తాడని కనుక వెంకీ షో కూడా మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: