అభిమానిని పెళ్లి చేసుకోబోతున్న ఆ బాలీవుడ్ యంగ్ హీరో..!

murali krishna
యువ హీరో అయిన కార్తీక్ ఆర్యన్‌కి అమ్మాయిలలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కార్తీక్ ఆర్యన్ కూడా యువతని ఆకట్టుకునే చిత్రాలపైనే దృష్టి పెట్టాడట.
రీసెంట్‌గా కార్తీక్ ఆర్యన్ ఒక్కసారి బయటకు రా అంటూ ఆ అమ్మాయిలు రోడ్డుపై నిలబడి గట్టిగా కేకలు పెడుతూ పెద్ద హంగామానే సృష్టించారట సెక్యూరిటీ వారించినా కూడా వినలేదు.


కార్తీక్ ఆర్యన్ ఒక్కసారి చూడాలి కలుసుకోవాలి అనే కోరికతో వారిద్దరూ అలా చేసారట. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో సదరు యువతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిలుగా మీకు ఆత్మగౌరవం లేదా ? ఇలా సెలెబ్రటీల ఇంటి ముందు నిలబడి గోల చేస్తారా ? అంటూ నెటిజన్లు కూడా ప్రశ్నించారు. అయితే రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ కు సోషల్ మీడియాలో పెళ్ళి చేసేసారు.. అది కూడా తన వీరాభిమాని అయిన ఓ అమ్మాయితో.

ఈ విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రస్తావించిన కార్తిక్ ఆర్యన్ తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేశారని చెప్పారు. ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యిందని సోషల్ మీడియాలో చూసే వరకూ అసలు విషయం తనకు తెలియదని అయితే ఎందుకు ఈ న్యూస్ ఇలా పుట్టుకొచ్చిందో కూడా వివరించారట కార్తిక్ ఆర్యన్.

ఒకసారి ఏం జరిగిందంటే నా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో లేడీ అభిమాని ఒకరు నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది అంతే, ఆ మాత్రానికే ఏకంగా నేను ఆమెను పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు సృష్టించారు.అది చూసి నేను బిగ్గరగా నవ్వుకున్నాను. అయ్యో మీకలా అనిపించిందా? అనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ యంగ్ హీరోను ఆరాధించే అభిమానులు అయితే చాలామందే ఉన్నారు.

బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యాన్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో బాగా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను కార్తిక్ అంటే ఎంతో క్రష్. ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా వెంటపడుతుంటారు లేడీ ఫాలోవర్స్. కార్తిక్ ఆర్యన్ కూడా హ్యాండ్సమ్ లుక్ తో.. బాలీవుడ్ లో మంచి పేరు సాధించాడు. వరుస సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు.

ఆ మధ్య ఓ ఫ్యాన్ తన గుండెల మీద కార్తిక్ ఆర్యన్ ఫోటోను పచ్చ బొట్టు వేయించుకున్నారు.ఈ యంగ్ స్టార్ అంటే ఎంతో ఇష్టం తో వేయించుకున్నాడట.. 2011 లో ఇండస్ట్రీ కి వచ్చిన కార్తిక్.. వరుసగా సినిమాలు చేస్తూ ఇంత వరకూ వచ్చాడట ముందు ముందు బాలీవుడ్ లో స్టార్ హీరోలను కూడా పక్కకు నెట్టి..కార్తిక్ ఆర్యన్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం షహజాది టైటిల్ తో అలవైకుంఠపురమలో సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: