"పూరి - ఇలియానా" సక్సెస్ రేట్ మైనస్...
ఈ దర్శకుడి చిత్రంలో నటించేందుకు స్టార్ నటీనటులు సైతం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి కంటెంట్ ఉన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది ఇలియాన. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ అందాల తారలు ఈ మధ్య అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే అప్పట్లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి, నేను నా రాక్షసి, దేవుడి చేసిన మనుషులు మొత్తం మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే ఇందులో పోకిరి చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా....నేను రాక్షసి, దేవుడు చేసిన మనుషులు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి.
కానీ ఈ సినిమాలతో ఇలియానా కి మాత్రం మంచి మార్కులే లభించాయి. స్టార్ హీరోయిన్ కాజల్ కూడా ఈ దర్శకుడితో కలిసి రెండు చిత్రాలు చేసింది. బిజినెస్ మ్యాన్ మరియు టెంపర్ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీసు వద్ద వసూలు వర్షం కురిపించి సరికొత్త రికార్డులు సృష్టించాయి. అయితే కాజల్ కన్నా ఇలియానాకు కొంచెం బాడ్ టైం నడిచింది అని చెప్పాలి.