అందమైన అనుపమా.. ఫొటోస్ వైరల్..!!

Divya
మలయాళం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనువెంటనే అవకాశాలను దక్కించుకుంది.. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే అవకాశాలు అందుకున్న ఎంతో మంది ముద్దుగుమ్మలో ఈమె కూడా ఒకరు.. ఇక వరుస సినిమాలతో మంచి క్రేజ్ ఉన్న హీరోల సరసన నటిస్తూ కెరియర్లో దూసుకుపోతోంది ఈ మలయాళం కుట్టి..
 
రీసెంట్ గా తన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఇకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అ, ఆ.. ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ

 మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.. మాటల మాంత్రికుడు అనుపమ చేత చెప్పించిన సూర్పణక , రావణాసురుడు డైలాగు బాగా హిట్ కావడంతో ఇక ఈమెకు అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది..
ఆ తర్వాత నాగచైతన్య నటించిన మలయాళం రీమేక్ అయినటువంటి ప్రేమమ్ సినిమాలో కూడా శృతి హాసన్ తో ఇంకొక హీరోయిన్ గా కలిసి నటించింది అనుపమ.. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో శతమానం భవతి సినిమా తో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ విజయం అందుకుంది.
 
అంతేకాదు 2017 ఏడాదికి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనుపమ పరమేశ్వరన్. ఇక అలా హ్యాట్రిక్ విజయాన్ని సంపాదించుకున్న ఈమె తన కెరియర్ కు పూలబాట కూడా వేసుకుంది. ఇక తాజాగా దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ తో కలిసి రౌడీ బాయ్స్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కొత్త హీరో సరసన ఈమె నటించడంతో తన పాత్రను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు.. ఇక ప్రస్తుతం పరికిణీ అందాలతో చూపరులను ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: