ఆర్ ఆర్ ఆర్ : చెర్రీకి ఆ సినిమాలు చేసే ధైర్యం ఇచ్చిందట..

Purushottham Vinay
ఆర్ ఆర్ ఆర్ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికే రిలీజై సంచలనాలు నమోదు చేసేది. కానీ అనూహ్యంగా సినిమా వాయిదా పడింది. కానీ అది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఏమాత్రం నిరాశపరచలేదు.ఇక ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కాని ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు.ఇక ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియా మూవీ అయినా ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ..ఇక రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ సినిమాలు చేయడానికి ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన చెప్పారు.ఇక అలాగే మునుముందు మరిన్ని బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు.

ఇకపై ప్రేక్షకులు సినిమాలను నటీనటులను చూసే విధానాన్ని ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తిగా మార్చేస్తుంది అని అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఇక ఆ తర్వాత కూడా జెర్సీ చిత్రంతో హిందీ మార్కెట్లో ప్రవేశిస్తున్న గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందుకు పూర్తి సన్నాహకాల్లో ఉన్నారు.అలాగే కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనూ ఓ సినిమా చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆయన తర్వాత ఎలాంటి సినిమాలు ప్రకటించనున్నారో తెలియాలంటే కాస్త వేచి చూడాలి. ఇక గతంలో చెర్రీ హిందీలో స్ట్రెయిట్ గా జంజీర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద అట్టర్ ప్లాప్ సినిమాగా నిలిచింది.మరి ఆర్.ఆర్.ఆర్ దెబ్బతో ఆ గాయాన్ని మానేలా చెయ్యాలనుకుంటున్నాడు రామ్ చరణ్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: