అవును నేను ప్రెగ్నెంట్ నే అంటూ షాక్ ఇచ్చిన సమంత..!

murali krishna
ప్రముఖ స్టార్ హీరోయిన్ అయిన సమంత మరియు స్టార్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ప్రేమించి పెళ్లి చేసుకొని టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఏడేళ్లు పాటు ఘాటుగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ నాలుగేళ్లు కూడా పెళ్లి బంధంలో కలిసి ఉండలేకపోయారు. వీరు విడాకులు తీసుకొని అందరికీ కూడా పెద్ద షాక్ ఇచ్చారు. అయితే విడిపోవడానికి పెద్ద కారణమే ఉందని అప్పట్లో వార్తలు కూడా ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వివాదం గురించి సంచలన వార్తలు వెలుగు చూశాయట.. పిల్లల్ని కనాలని ఎంత ఒత్తిడి చేసినా కూడా సమంత తన అందం చెడిపోతుందేమో అని ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తూ వచ్చిందని.. ఈ విషయంలోనే వీరి మధ్య పెద్ద గొడవ చినికి చినికి గాలివాన అయిందని కథనాలు కూడా ఎన్నో వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో “మీరు ప్రెగ్నెంటా, మేడమ్?” అని ప్రశ్నిస్తే సమంత అవునంటూ షాక్ ఇచ్చిందట.

ప్రెగ్నెన్సీ ప్రశ్నకు సమంత ఉన్నట్టుండి షేక్ అయ్యేలా సమాధానం ఇచ్చింది. “అవును, నేను పెళ్లి అయిన సమయం నుంచి అంటే 2017 నుంచి గర్భవతిగా వున్నాను.కానీ ఈ పాప కడుపులో నుంచి బయటకు రావాలని అస్సలు కోరుకోవడం లేదు. ఏం చేస్తాం పాపం అని బదులు ఇచ్చింది. అయితే ఇలా వ్యంగ్యంగా చెప్పినప్పటికీ కూడా “అవును, నేను ప్రెగ్నెంట్ నే” అని మొదట ఆమె నోటి నుంచి వచ్చిన పదాలను విని తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా ఉలిక్కిపడ్డారట.. ఏదేమైనా సమంత ఇప్పుడు, అప్పుడు.. ఎప్పుడూ కూడా ఎప్పటిలాగే సమాధానం చెప్తూ తన మెంటల్ బ్యాలెన్స్ ఏంటో నిరూపించుకుందని తెలుస్తుంది.

ఇంటర్వ్యూలో నాగచైతన్య కు సంబంధించిన టాటూలపై కూడా ఆమెను వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అవి తమకు చాలా స్పెషల్ అని సమంత రిప్లై కూడా ఇచ్చిందట.. ఏదేమైనా ప్రెగ్నెన్సీ గురించి సెటైరికల్ గా సమాధానమిచ్చి అభిమానులను ఒక్క క్షణం పాటు షాక్ ఇచ్చి ఆపై నవ్వించేసిందట సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: