గుర్రంతో డాన్స్ చేయిస్తున్న బాలయ్య..!

murali krishna
ఎన్నో రోజుల తరువాత నందమూరి నటసింహం అయిన బాలకృష్ణ `అఖండ` చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయంని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన బాలయ్య మాత్రం ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
విజయాన్ని ఊహించని రీతిలో పండుగలా చేసుకుంటున్నారు. ఆహా కోసం `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికే` టాక్ షోలో కూడా అదే జోష్ ని చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ ఈ సంక్రాంతిని కుటుంబ సభ్యులతో ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటున్నారు.
ఇందు కోసం ప్రకాశం జిల్లాలోని కారంచేడులో వున్న తన సోదరి అయిన దగ్గుబాటి పురందేశ్వరి ఇంటికి వెళ్లారని సమాచారం.. అక్కడ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన ఎంతగానో సందడి చేశారు. గుర్రం పైకి ఎక్కి బాలయ్య చేసిన హంగామా అయితే అస్సలు మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట బాగా సందడి చేస్తోంది. పక్కనే ఉన్న ఆయన సతీమణి అయిన వసుంధర కూడా బాలయ్య ఎనర్జీ కి షాక్ అయిపోయారు.
బాలయ్య గుర్రం మీద స్వారీ చేయాలని ప్రయత్నిస్తున్న వేళ ఆ జిల్లా నలుమూల నుంచి వచ్చిన అభిమానులు అయితే మాత్రం జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలతో బాలయ్య కు ఉత్సాహాన్ని ఇచ్చారు. వాయిద్యాలతో స్థానికులు పాటలు పాడుతుంటే బాలయ్య మాత్రం గుర్రంపై డ్యాన్స్ చేయడం ఎంతగానో ఆకట్టుకుంటోందని సమాచారం.బాలయ్య తరువాత ఆయన వారసుడు అయిన నందమూరి మోక్షజ్క్ష కూడా గుర్రంపై స్వారీ చేయడంతో అక్కడున్న వారంతా ఆయనని చూసి మురిసిపోయారు.
`అఖండ` మూవీ అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె ` టాక్ ఫో సక్సెస్ కావడంతో భారీ ఉత్సాహంతో వున్న బాలకృష్ణ ఈ సంక్రాంతిని తన సోదరి అయిన దగ్గుబాటి పురందేశ్వరి గారి ఇంట జరుపుకోవాలని కుటుంబ సమేతంగా వారు ప్రకాశం జిల్లా కారంచేడు కు చేరుకున్నారు. దీంతో బాలయ్య వచ్చిన విషయం ఊరంతా వైరస్ పాకినట్టు పాకింది.దీంతో బాలయ్య అభిమానులు బారీ సంఖ్యలో తరలి వచ్చి బాగా సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య గుర్రంపై డ్యాన్స్ చేస్తూ హల్ చల్ చేసిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: