వారి బాటలోనే ప్రయానిస్తున్న కృతి శెట్టి..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షం కురిపించింది,  ఈ సినిమా తర్వాత కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది, అయితే తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమాతో మూడో విజయాన్ని కృతి శెట్టి సొంతం చేసుకుంది, ఈ సినిమాలో లో కృతి శెట్టి, నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో కృతి శెట్టి లాగానే ఆసిన్, అనుపమ పరమేశ్వరన్ లకు కూడా జరిగింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఒకే సంవత్సరం రెండు విజయాలు సాధించి ఆ తర్వాత సంక్రాంతి మరో విజయం సాధించారు.
అసిన్ : అందాల ముద్దుగుమ్మ ఆసిన్ 2003 వ సంవత్సరం విడుదలైన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, అదే సంవత్సరం శివమణి సినిమాతో మరో విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత 2004 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన లక్ష్మీనరసింహ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది.
అనుపమ పరమేశ్వరన్ : అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ  సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా 2016 సంవత్సరం విడుదల అయ్యింది, ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని సాధించింది, ఈ సినిమాతో పాటు ఇదే సంవత్సరం అనుపమ పరమేశ్వరన్ మరో విజయాన్ని అందుకుంది, ఆ తర్వాత 2017 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానం భవతి సినిమాతో ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి మరో విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: