తమిళ తారల సంక్రాంతి సంబరాలు.. ఫ్యాన్స్ ఖుషి..!

Satvika
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు.. వారం ముందు నుంచి ప్రజలు సంక్రాంతి పిండి వంటలు చేస్తూ బిజిగా ఉన్నారు.. ఒకవైపు కోడి పందాలు మరోవైపు ముగ్గుల పోటీలలొ ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు.. ఇక సినీ తారల గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికి తాము ఎలా చెస్తమొ, ఎలా ఉంటారు అనే విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నం చెస్తున్నారు. నిన్న భోగి సందర్బంగా మెగా ఫ్యామిలి దోస లు వేసుకోవడం అందరూ కలిసి తినడం వంటివి అందరినీ తెగ ఆకర్షించాయి.

తమిళ నాడు లో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సినీ తారలు భోగి పండుగను చాలా పద్దతిగా జరుపుకున్నారు.సూర్య, జ్యోతిక కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే మామూలు విషయం కాదు. కాగా ఇప్పుడు సూర్య హీరో నుంచి నిర్మాతగా మారాడు.జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

పండగ సందర్బంగా సూర్య, జ్యోతిక ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో వారిద్దరు చాలా పద్దతిగా ఉన్నారు. లవ్లీ కపుల్ అంటే వీళ్ళే అన్న విధంగా కనిపిస్తున్నారు. అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భోగీ మంటలు వేసి.. ఆ మంటలపై పొంగలి కాస్తూ ఈ జంట కనిపించారు. బ్లూ కలర్ కుర్తాలో సూర్య, వైట్ శారీ లో జ్యొథిక ఉన్నారు.  ఇందులో కార్తీ కూడా ఉన్నాడు.ఇప్పుడు వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీరు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామని ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది..వీరంతా వరుస సినిమా లలో నటిస్తూ బిజీగా వున్నారు. ఇది ఇలా ఉండగా..చిరంజీవి, రోజా,వైఎస్ జగన్, బాలకృష్ణ వంటి ప్రముఖులు కూడా సంక్రాంతి పండుగని సరదాగా జరపుకున్నారు.వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: