కీర్తి సురేష్ ఆరోగ్యం ఎలా వుందంటే...

VAMSI
ఇప్పుడు ఎటు చూసినా కరోనా గోలే వినిపిస్తోంది, ఇటు సినీ ఇండస్ట్రీలోనూ కరోనా కల్లోలం మొదలయ్యింది. ఇప్పటికే మహేష్ బాబు, వరలక్ష్మి, త్రిష, రేణు దేశాయ్ వంటి పలువురు సినీ సెలబ్రిటీలకు కరోనా సోకగా కీర్తి సురేష్ కూడా కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ప్రస్తుత సమాచారం మేరకు ఆమెకు కరోనా లక్షణాలు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె తమ డాక్టర్ పర్యవేక్షణలోనే ఉన్నారని ప్రమాదం ఏమీ లేదని అభిమానులు ఆందోళన చెందొద్దని చెబుతున్నారు.
ఇక కీర్తి సురేష్ కాస్త కుదట పడగానే ఆమె వీడియో ద్వారా ఫ్యాన్స్ పలకరించనున్నారని సమాచారం. మహేష్ బాబుతో కలసి 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ కి హీరో మహేష్ కారణం గానే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది. దుబాయ్ నుండి వచ్చిన ప్రిన్స్ కు మొదట కరోనా పాజిటివ్ అని తేలిన ఆ తరువాత కీర్తి సురేష్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ సినిమా వర్క్ లో మహేష్ తో క్లోజ్ గా మూవ్ అయిన వారందరికీ కరోనా భయం పట్టుకుందట.
ఎంతైనా అది వైరస్ మనతో ఉన్న వారికి కోవిడ్ వచ్చింది అంటే మనకు కూడా వస్తుందో అన్న టెన్షన్ సహజమే కదా. అయితే ఇప్పుడు ఈ కారణంగా సర్కారు వారి పాట సినిమా కూడా వాయిదా పడింది. కరోనా మహమ్మారి వలన చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఈ కరోనా నుండి మనకు శాంతి లభిస్తుందో తెలియడం లేధు. త్వరలోనే కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు లు కోలుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: