సుకుమార్ ను హర్ట్ చేసిన మణిరత్నం ?

Seetha Sailaja

‘పుష్ప’ మూవీ విడుదల తరువాత సుకుమార్ పేరు మారుమ్రోగి పోతోంది. వాస్తవానికి ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చి విమర్శకుల నుండి చెప్పుకోతగ్గ ప్రశంసలు రాకపోయినప్పటికీ ఈమూవీకి బాలీవుడ్ లో వస్తున్న కలక్షన్స్ ను చూసి బాలీవుడ్ మీడియా కూడ ఆశ్చర్యపోతోంది. ఈమూవీకి కేవలం బాలీవుడ్ నుండి 25 కోట్లకు పైగా కలక్షన్స్ రావడంతో సుకుమార్ పేరు బాలీవుడ్ మీడియాలో కూడ తెగ హడావిడి చేస్తోంది.

దీనితో సుకుమార్ పేరు బాలీవుడ్ లో కూడ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇంత పాపులారిటీ సంపాదించిన సుకుమార్‌ ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందు స్ఫూర్తినిచ్చింది మ‌ణిర‌త్నం అట‌. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన  చిన్న తనంలో ‘గీతాంజ‌లి’ సినిమా చూసి మణిరత్నం అభిమానిగా మారిపోయిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో ఆసినిమాను తాను చూసింది ఒక నాన్ ఏసీ థియేట‌ర్లో అయిన‌ప్ప‌టికీ తెలియ‌ని ఒక చ‌ల్ల‌ద‌నాన్ని ఫీల్ అయిన విషయాన్ని  బయటపెట్టాడు.

ఒక సినిమాను తీస్తే ఇంతగా జనాన్ని ప్రభావితం చేయవచ్చు అన్నఆలోచన రావడంతో అప్పుడే తాను దర్శకుడుగా మారాలని ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలియచేసాడు. అయితే తనకు అలాంటి స్పూర్తిని ఇచ్చిన మణిరత్నం నుండి తనకు అనుకోని అవమానం ఎదురైంది అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.  

తాను ద‌ర్శ‌కుడు కావ‌డానికి ముందు మ‌ణిర‌త్నంను క‌ల‌వ‌డానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను కలవలేకపోయినప్పటికి తాను దర్శకుడుగా మారి ‘ఆర్య’ మూవీని చిత్రీకరిస్తూ ముంబాయిలో ఉన్నప్పుడు అదే హోటల్ లో మణిరత్నం కూడ ఉన్నారని తెలిసి ఆయన రూమ్ వద్దకు వెళ్ళినప్పుడు మణిరత్నం నటి శోభన తో ఎదో విషయం చాల సీరియస్ గా మాట్లాడుతూ కనిపించిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆ సీరియస్ ను గుర్తించకుండా తనకు తానుగా తాను ఆ రూమ్ లోకి వెళ్ళి మణిరత్నం ను పలకరించినప్పుడు ఆయన అసహనానికి లోనై కోపంగా వెళ్ళు అంటూ సైగ చేసారని అంటూ ఏ వ్యక్తిని ఎప్పుడు కలవాలో అప్పట్లో తనకు పూర్తిగా తెలియదు అంటూ తనపై తానే జోక్ చేసుకున్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: