ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ శీను...!

murali krishna
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు పెంచుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు అన్ని భాషల ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు.కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలుస్తుంది.. హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రభాస్ గురించి తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా అనేక రకాల కథనాలు బాగా వెలువడుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ దగ్గర వర్క్ చేసే అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ప్రభాస్ శ్రీను కూడా రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎవరూ ఊహించని విధంగా ఒక క్లారిటీ ఇచ్చేశాడని తెలుస్తుంది.బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతాయని ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. సాహో సినిమా తరువాత ప్రభాస్ మరింత ఫాస్ట్ గా సినిమాలను నిలబెట్టే దిశగా ముందుకు సాగిపోతున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు.
అయితే ప్రభాస్ కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. పుట్టిన ప్రభాస్ పెళ్లి గురించి ప్రతి ఏడాది కొన్ని వేల వార్తలు వస్తున్నాయి. గతంలో కొంతమంది హీరోయిన్స్ తో కూడా ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు స్టోరీ లు కూడా అల్లెశారు. ఇక ప్రభాస్ కూడా వాటిని పెద్దగా పట్టించుకోవడం అస్సలు మానేశాడు.
ముఖ్యంగా అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఏస్థాయిలో వార్తలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రూమర్స్ డోస్ ఎక్కువైనా మొదట్లోనే ప్రభాస్ ఒక మంచి కామెంట్ కూడా చేశాడట.ఈ రూమర్స్ తగ్గాలంటే ముందుగా మా ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేసాడు..
అయితే మధ్యలో కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి పై తరచు ప్రశ్నలు ఎదురవడంతో లైవ్ లోనే అసహనం కూడా వ్యక్తం చేశాడు. తాము పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా కూడా ప్రభాస్ వినడం లేదు అనే విధంగానే వివరణ ఇచ్చారట.. ప్రభాస్ చిన్నపిల్లాడు కాదు అని అతనికి అన్ని తెలుసు అని మేము కూడా ఎంత చెప్పినా ఏం లాభమని కొంత అసంతృప్తిగానే వివరణ ఇచ్చారట..
 ఇక ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రభాస్ మాత్రం 'సోలో లైఫ్ సో బెటర్' అనే విధంగానే ముందుకు సాగుతున్నాడట.. అయితే గతంలో బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాను అని కుటుంబ సభ్యులతో చెప్పినప్పటికీ మళ్లీ ఎప్పటిలానే అంతకుమించి సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్నాడు ప్రభాస్. ఇక ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశం లేదని అందరిలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను కూడా ప్రభాస్ పెళ్లిపై ఒక కామెంట్ కూడా చేసాడట . ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు శ్రీను ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడట.  చాలామంది అడిగారని అయితే నువ్వు నేను ఆ విషయం మాట్లాడుకున్నంత మాత్రాన ప్రభాస్ పెళ్లి అయిపోదు కదా దేనికైనా సమయం రావాలి అని, ఆ సమయం వచ్చినప్పుడు అవుతుంది అంటూ చాలా సున్నితంగా ప్రభాస్ శ్రీను చెప్పాడట.. అంతే కాకుండా ఆయన పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం తెలుస్తుంది  అని తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: