మరేంటో: రష్మిక పేరు మారిపోయిందట.. ఇప్పుడు మందన్న కాదంట..!!

N.ANJI
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో రష్మిక మందన్న ఒకరు. వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోల కన్నా మరింత ఎక్కువ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ భామ. అంతేకాదు.. నేషనల్ క్రష్‌గా మారిపోయిన ఈ హాట్ బ్యూటీ.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా రాణిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్‌ను పీక్స్‌లో ఉండేలా చూసుకుంటుంది.
అయితే శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూ.. అగ్ర హీరోలందరితో సినిమాలు చేస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్‌ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటించిన ఈ భామ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక పాన్‌ ఇండియాగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్‌నే కాకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. అల్లు అర్జున్‌తో వచ్చే సన్నివేశాలల్లో అమ్మడు నటించిన సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ రీసెంట్‌గానే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాను మరోసారి టీవీల్లో చూస్తూ బన్నీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పుష్ప సినిమా చివర్లో నటీనటుల పేర్లు వేస్తారని ప్రతీ సినిమా ప్రేక్షకుడుకి తెలిసిన విషయమే.
అలాగే ఈ సినిమా టైటిల్స్‌లో రష్మిక మందన్నాకు బదులు రష్మిక మడోనా అని తప్పుగా పడింది. ఇక దీంతో నెటిజన్స్‌ నెట్టింట ఆ స్క్రీన్ షాట్‌తో ట్రోలింగ్ చేస్తూ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే తెలుగులో తప్పుగా వచ్చిందంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోలేకపోయేవారేమో.. కానీ ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద అక్షరాల్లోనూ రష్మిక మందన్న పేరు తప్పుగా వచ్చిందని వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: