Sankranti Winners: 20 ఏళ్ల నుంచి సంక్రాంతి విజేత‌లుగా నిలిచిన సినిమాలు ఏమిటో తెలుసా..?

N ANJANEYULU
ప్ర‌తీ ఏడాది సంక్రాంతి పండుగ వ‌చ్చిదంటే పండుగ హ‌డావిడి మామూలుగా ఉండ‌దు. తెలంగాణ ప్రాంతంలో ద‌స‌రా, ఆంధ్రాలో సంక్రాంతి పండుగలు ఎంతో వైభ‌వంగా జ‌రుపుకుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  అయితే సంక్రాంతి పండుగ‌ను దాదాపు వారం  రోజుల పాటు చేస్తుంటారు. పండుగ‌కు గాలిప‌టాలు, కోడిపందెంలు, వంటి వాటితో పాటు ఇంటి ముందు గొబ్బెమ్మ‌, సంక్రాంతి ముగ్గులు ఇలా వారం రోజుల పాటు పండుగ వాతావ‌ర‌ణం ఉంటుంది.
సంక్రాంతి పండుగ స‌మ‌యం నాటికి రైతుకు పండిన పంట ఇంటికి చేరుకోవ‌డంతో పూర్వ‌కాలం నుంచి పండుగ‌ను ఎక్కువ‌గా జ‌రుపుకుంటారు. సంక్రాంతి స‌మ‌యంలో రైతులు సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు.  సినిమాల‌ను పండుగ సంద‌ర్భంలో ఎక్కువ‌గా చూస్తుండ‌డంతో ప్ర‌తీ ఏడాది సంక్రాంతికి సినిమాలు బాగానే వ‌స్తుంటాయి. గ‌త 20 ఏండ్ల కాలంలో ఎన్నో సినిమాలు పండుగ‌కు వ‌చ్చి  సంచ‌ల‌నం సృష్టించాయి. గ‌త 20 ఏండ్ల కాలంలో వచ్చి విజ‌యం సాధించిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా 2000 సంవ‌త్స‌రంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్‌గా ఉద‌య్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ నిర్మాత‌గా, రామానాయుడు స‌మ‌ర్పించిన ఈ సినిమా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. అదేవిధంగా  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హీరోగా, సిమ్రాన్ హీరోయిన్‌గా బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో మేడికొండ వెంక‌ట ముర‌ళికృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమా 2001లో భారీ విజ‌యం సాధించిన సినిమాగా నిలిచింది. బాల‌కృష్ణ కెరీర్‌లో పెద్ద‌హిట్ చిత్రం ఇదే కావ‌డం విశేషం. 2002లో  త‌రుణ్ న‌టించిన నువ్వులేక నేను లేను సినిమా కూడా సంక్రాంతికి వ‌చ్చి విజ‌యం సాధించింది.
ఇక 2003లో మ‌హేష్‌బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు నిర్మాత‌గా, గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌డు సినిమా అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నమే సృష్టించింది. మ‌హేష్ బాబు భారీ హిట్ చిత్రాల్లో ఒక్క‌డు ఒక‌టి. 2004లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, హీరోయిన్ త్రిష జంట‌గా న‌టించిన చిత్రం  వ‌ర్షం ప్ర‌భాస్ కెరీర్‌నే మ‌లుపు తిప్పిన సినిమా ఇది. ఈశ్వ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టికీ అంత‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు ప్ర‌భాస్‌. వ‌ర్షం సినిమాతో ప్ర‌భాస్‌, త్రిష‌లు అంద‌రి హృద‌యాల‌ను దోచుకున్నారు.
2005లో సిద్దార్థ్‌, శ్రీ‌హ‌రి, త్రిష‌లు న‌టించిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిట్‌గా నిలిచింది. 2006లో విక్ట‌రీ వెంక‌టేష్ సినిమా ల‌క్ష్మీ విజ‌యం సాధించింది. 2007లో పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్‌, హ‌న్సిక జంట‌గా న‌టించిన చిత్రం దేశ‌ముదురు ఇది భారీ విజ‌యం సాదించింది. 2008లో మాస్ మ‌హారాజా ర‌వితేజ చిత్రం కృష్ణ వివివినాయ‌క్ ద‌ర్శ‌క‌త్ంలో వ‌చ్చి విజ‌యాన్ని అందుకుంది. 2009లో అరుంద‌తి అనుష్క హీరోయిన్‌గా కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి విజ‌యాన్ని అందించింది. 2010లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, వివివినాయ‌క్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అదుర్స్ భారీ విజ‌యాన్ని అందుకుంది.
2011లో ర‌వితేజ హీరోగా హ‌రీశ్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పుప్పాల నిర్మాత‌గా మిర‌ప‌కాయ్ సినిమా విజ‌యం సాధించింది. 2012 సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు- పూరిజ‌గన్నాథ్ కాంబోలో వ‌చ్చిన బిజినెస్‌మేన్ విజ‌యాన్ని అందుకుంది. 2013లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మ‌హేష్‌బాబు, వెంక‌టేష్ క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీతో పాటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన నాయ‌క్ చిత్రం కూడా ఘ‌న విజ‌యం సాధించింది. 2014లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఎవ‌డు, 2015లో గోపాలా గోపాలా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, వెంక‌టేష్ క‌లిసి నటించిన చిత్రం హిట్ గా నిలిచింది. 2016లో నాగార్జున  సొగ్గాడే చిన్నినాయానా తో పాటు శ‌ర్వానంద్ న‌టించిన ఎక్స్‌ప్రెస్ రాజా హిట్‌గానే నిలిచింది.
ఇక 2017లో ఏకంగా మూడు చిత్రాలు హిట్‌గా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీగా ఇచ్చిన ఖైదీ నెంబ‌బ‌ర్ 150, బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి, శ‌ర్వానంద్ న‌టించిన శ‌త‌మానం భ‌వతి సినిమాలు విజ‌యంగా నిలిచాయి. ఇక 2018లో బాల‌కృష్ణ న‌టించిన జై సింహా విజ‌యం సాధించ‌గా.. 2019లో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ ఎఫ్‌2 భారీ విజ‌యం ద‌క్కించుకుంది. 2020లో మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు, అల్లుఅర్జున్ అలా.. వైకుంఠ‌పురంలో సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచాయి. 2021లో క‌రోనా త‌రువాత వ‌చ్చిన  ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమా సూప‌ర్ హిట్ కొట్టింది. 2022లో నాగార్జున, నాగ‌చైతన్య న‌టించిన బంగార్రాజు, అదేవిధంగా నిర్మాత శిరీష్ కుమారుడు ఆశీష్ ప‌రిచ‌యం అవుతూ.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న రౌడీబాయ్స్ ముఖ్యంగా పోటీల్లో ఉన్నాయి. ఈ సక్రాంతి బ‌రిలో సూపర్ మచ్చి , హీరో సినిమాలు కూడా సంక్రాంతి బ‌రిలో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  2022లో ఏ సినిమా హిట్ అవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: