అమలాపాల్ కట్టుకున్న చీర ఖరీదు ఎంతో తెలుసా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో నటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వ్యక్తిగత విషయంలోకి వెళ్తే.. ఆమె కేరళలో జన్మించినా తెలుగు, తమిళంతో పాటు దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె కోచిలో చదువు పూర్తి చేసిన అమలా పాల్ ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి అందరికి తెల్సిందే. టాలీవూడ్ ఇండస్ట్రీలో అమలాపాల్ మెగా హీరోలకు జోడీగా నటించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో అమలా పాల్ సెకండ్ హీరోయిన్ గా నటించగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే నాయక్ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా అమలా పాల్ కెరీర్ కు పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి మరి. ఇక హీరోయిన్ అమలా పాల్ పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా అమలా పాల్ చీర ధరించిన ఒక ఫోటో వైరల్ అవుతుండగా ఈ చీర ఖరీదు ఏకంగా 46000 రూపాయలు అని ఉంటుందని సమాచారం. అంతేకాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ రోల్స్ లో కంటే అభినయ ప్రధాన పాత్రల్లో అమలా పాల్ ఎక్కువగా కనిపిస్తున్నారు..
ఇక చీరలో అమలా పాల్ మెరిసిపోతున్నారు. ఆమె స్టైలిష్ గా ఉండటంతో పాటు కంఫర్ట్ గా ఉండే దుస్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ స్టార్ హీరోయిన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో స్కిన్ కలర్ విషయంలో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించడంతో తాను బాధ పడ్డానని అన్నారు. ప్రస్తుతం అమలా పాల్ చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేవు. ఇటీవల కాలంలో అమలా పాల్ నటించిన ఆమె సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించగా ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: