రమేష్ బాబు సామ్రాట్ టైటిల్ కోసం కృష్ణ అంత ఫైట్ చేశారా..!

shami
సూపర్ స్టార్ కృష్ణ మొదటి నట వారసుడు పెద్ద కొడుకు ఘటమనేని రమేష్ బాబు శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కృష్ణ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తారు అనుకున్న రమేష్ బాబు కెరియర్ లో ముందుకు సాగలేకపోయారు. హీరోగా అటు ఇటుగా 18 సినిమాలు దాకా తీసిన ఆయన నిర్మాతగా కూడా సక్సెస్ అవలేకపోయారు. అయితే కృష్ణ వారసుడిగా రమేష్ బాబు ఎంట్రీ గ్రాండ్ గా ప్లాన్ చేశారు కృష్ణ. మధుసూధనరావు డైరక్షన్ లో సామ్రాట్ టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేశారు.
అప్పటికే దాసరి నారాయణ రావు డైరక్షన్ లో నీడ సినిమా తో తెరంగేట్రం చేశాడు రమేష్ బాబు. సామ్రాట్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బేతాబ్ కి రీమేక్. ఈ సినిమా టైటిల్ విషయం లో కొంత గొడవ జరిగింది. బాలకృష్ణ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు. అయితే ముందు రమేష్ బాబు సినిమాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేయడంతో కోర్ట్ కి వెళ్లి మరి కృష్ణ సమ్రాట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. అలా సమ్రాట్ టైటిల్ రమేష్ బాబుకి దక్కింది.
బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ అని మార్చుకున్నారు. రమేష్ బాబు కోదండరామి రెడ్డి డైరక్షన్ లో వచ్చిన బజార్ రౌడీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాసరి నారాయణ రావు, జంధ్యాల, మురళి మోహన్ రావు, ఎస్.ఎస్ రవిచంద్ర లాంటి డైరక్టర్స్ తో రమేష్ బాబు సినిమాలు చేశారు. తన నట వారసుడిగా రమేష్ బాబుని స్టార్ ని చేద్దామని అనుకున్నారు కృష్ణ. కానీ రమేష్ బాబు కెరియర్ మధ్యలోనే ఆపేశారు. 1997లో కృష్ణ నటించిన ఎన్ కౌంటర్ సినిమాలో చివరిగా నటించారు రమేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: