నేడు ఆహా లో 'లక్ష్య'

Divya
తెలుగు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం లక్ష్య.. ఈ సినిమాను ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. 2021 డిసెంబర్ 10వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో హీరోగా నాగసౌర్య నటించగా, హీరోయిన్ గా రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికశర్మ నటించారు. ఇక జగపతి బాబు , సచిన్ ఖేడేకర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించింది అని చెప్పవచ్చు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు , ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే పుష్ప సినిమా కంటే ముందుగానే ఈ సినిమా విడుదల కావడంతో పెద్ద సినిమాలను తట్టుకోలేక కొంతవరకు విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమా కధ విషయానికి వస్తే.. పార్ధు తన చిన్నతనం నుంచి విలువిద్యలో పూర్తిగా ప్రతిభావంతుడు.. ఇక ఈ విషయాన్ని గమనించిన అతని తాత హైదరాబాదులో ఉన్న ఉత్తమ విలువిద్య అకాడమీలో చేర్పించి, తన సంపాదనంతా పూర్తిగా ఖర్చు చేస్తాడు. అతనికున్న నైపుణ్యమే కారణంగానే రాష్ట్ర చాంపియన్ గా మార్చడానికి సహాయపడుతుంది. అప్పుడు రితికా తో ప్రేమలో పడటం, తాతయ్య ఆకస్మిక మరణం అన్నీ కూడా తీవ్ర డిప్రెషన్కు గురి చేస్తాయి. ఇక పూర్తిగా డ్రగ్స్ కి బానిస అవుతాడు.. కానీ ఎవరో ప్లాన్ చేసి తన స్నేహితుల ద్వారా తనకు డ్రగ్స్ కు బానిస చేశారని తెలుసుకున్న అతను నార్కోటిక్స్ పరీక్షలో ఫెయిల్ అవడంతో సస్పెండ్ చేయబడ్డాడు..
తర్వాత మద్యానికి బానిసవడం ఇక ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని చివరికి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొని ఎట్టకేలకు తన తాత కళను సహకారం చేసి పథకాన్ని సాధిస్తాడు.. ఇక ఇలా ప్రేక్షకులను ఈ సినిమా కాన్సెప్ట్ బాగా మెప్పించింది.అయితే థియేటర్లకు వెళ్లి చూడలేని ప్రేక్షకుల కోసం ఈరోజు నుంచి ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీంతో నాగశౌర్య అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: