వైరల్: మరోసారి రెచ్చిపోయిన యూట్యూబ్ స్టార్.. వరల్డ్ కప్ కొడితే బోల్డ్ గా..!

N.ANJI

యూట్యాబ్ స్టార్ పూనమ్ పాండే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. 2023లో ఇండియా వరల్డ్ కప్ సాధిస్తుందనే నమ్మకం తనకుందని పేర్కొంది. ఇండియాలో క్రికెట్‌కి ఎంతో క్రేజ్ ఉందని, గల్లీకొక సచిన్ టెండూల్కర్ ఉన్నాడని ఆమె పేర్కొంది. వరల్డ్ కప్ కొడితే బోల్డ్ గా కనిపిస్తానని గతంలో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ విషయంపై కూడా ఈమె స్పష్టతనిచ్చింది. దీంతోపాటు తనకు రాజకీయాలు నచ్చవని చెబుతూనే.. రాహుల్ గాంధీ ఇష్టమని పేర్కొంది. క్రికెట్ అంటే ఎంతో మందికి ఇష్టమని, సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఆమె పేర్కొంది. అలాగే కపిల్ దేవ్ బయోపిక్ సినిమా ‘83’ని చూడలేదని, ఆ సినిమాపై ఎలాంటి రివ్యూ ఇవ్వలేనన్నారు.


ఇటీవల ఒక రెస్టారెంట్‌లో బిర్యానీ తినడానికి వెళ్లిన పూనమ్.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ కొత్త ఏడాది మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. ‘‘నేను బాగానే ఉన్నాను. సింగల్‌గా ఉండటం వల్ల ఎలాంటి బాధలు లేవు. నన్ను చూసి కాపీ కొట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లు నేను సేమ్ కాదు.’’ అని పూనమ్ పొగరుగా జవాబిచ్చింది. అంతే కాదు తన పేరు పూనమ్ పాండే కాదని, పూనమ్ శోభన పాండే అని పేర్కొంది.


పూనమ్ పాండే యూట్యూబ్ స్టార్‌గా, మోడల్‌గా కొనసాగుతున్నారు. పూనమ్ వేసుకునే దుస్తువులు, ఫోటో షూట్‌లకు ఇచ్చే ఫోజులు చూస్తే మగాళ్లకు మత్తెక్కించేలా ఉంటాయి. ఇలాంటి ఫోటోలు చూస్తే సెక్సువాలిటీని ప్రేరేపిస్తున్నారని అంటే.. నేనొక్కదాన్నే కాకపోవచ్చని కానీ, నేను మాత్రం కాదని చెప్పుకొచ్చారు పూనమ్. ఈ ఇయర్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, యూట్యూబ్ ఛానల్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తనపై వచ్చే కాంట్రవర్సీలు, బోల్డ్ కామెంట్స్ ని ఏ మాత్రం లెక్క చేయదు. ఛాన్సు దొరికితే చాలు పబ్లిక్ ప్లేసుల్లో తన అందాలను ఆరబోస్తుంటుంది. పర్సనల్ వీడియోలతో సోషల్ మీడియాను హల్ చల్ చేస్తుంటుంది. ఈమెకు తగ్గట్లే నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: