నాని మొదటి రెమ్యూనరేషన్ తో ఏం చేశాడో తెలుసా?

VAMSI
సినిమా రంగ చరిత్రలో అందరూ రాత్రికి రాత్రే స్టార్ హీరోలు అయిపోలేదు. వారు అలా మారడం వెనుక ఎంతో అక్షతాం, శ్రమ దాగి ఉంది. అటువంటి వారిలో సహజ నటుడు నాని ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు హీరో నాని. ఈ హీరో అసలు పేరు ఘంటా నవీన్ బాబు సినిమాల్లోకి వచ్చాక నానిగా మార్చుకున్నారు. నాని 1984 , ఫిబ్రవరి 24 న తెలంగాణ లోని హైదరాబాద్ అమీర్ పేట్ లో జన్మించారు. ఇపుడు నాని వయసు 37. నాని కుటుంబ సభ్యులు...తండ్రి రాంబాబు తల్లి విజయ లక్ష్మి...సోదరి దీప్తి.
 
అంజన అనే అమ్మాయిని 2012, 27 అక్టోబర్ న ప్రేమించి పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు నాని. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు పేరు అర్జున్. నాని తన మొదటి సినిమా 'అష్టాచమ్మా' నుండి వచ్చిన  పారితోషికం నుండి కొంత డబ్బుతో ఫోర్డ్ ఫీస్ట్ అనే కార్ ను కొనుగోలు చేశారు. దీని ఖరీదు 6.70 లక్షలు. 2018 లో బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా చేసి సక్సెస్ఫుల్ గా  నడిపించారు.  ఆ తర్వాత వాల్ పోస్టర్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ను నిర్మించిన నాని అ: ,హిట్ లాంటి చిత్రాలను నిర్మించారు. చదువు విషయానికొస్తే నాని డిగ్రీ చదివారు. చిన్నతనం నుండే సినిమాలపై మక్కువ ఎక్కువ ఉండటంతో ఇండస్ట్రీనే తన కెరియర్ గా ఎంచుకున్నాడు.
మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టి నేడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నారు. ఎప్పుడూ కొత్త కథలను ఎంచుకుంటూ లైఫ్ లో ముందుకు వెళుతున్నారు. ఇటీవల విడుదలైన "శ్యామ్ సింగరాయ్" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: