చరణ్ - ఉపాసనల లవ్ స్టోరీలో ఈ విషయాలు మీకు తెలుసా ... ??
ఇక రామ్ చరణ్ 2012లో, తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక తమ ప్రేమ కథ గురించి అక్కడక్కడా పలు సందర్భాల్లో చరణ్ వివరించారు. నిజానికి తన కంటే కూడా లైఫ్ అంటే ఎంతో విజన్, ఆలోచనలు ఉన్న అమ్మాయి ఉపాసన అని, చిన్నప్పటి నుండి తనతో మంచి పరిచయం, స్నేహం ఆ తరువాత తన ఇష్టాలు ఎంతో నచ్చడంతో ప్రేమగా మారిందని అన్నారు. అనంతరం ఒకానొక సందర్భంలో ఆమెకు లవ్ ప్రపోజ్ చేయడం, ఆ తరువాత ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఏర్పడడం జరిగిందని చెప్పుకొచ్చారు.
అయితే ఉపాసన ఎక్కువగా తన ఇష్టాలను కూడా గౌరవిస్తుందని, చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే మంచి గౌరవం ఉన్న తనకు ఉపాసన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని చూసి ఆడవారిపై గౌరవం మరింతగా పెంచిందని అన్నారు. ఇక తమ ప్రేమ కథలో పెద్దగా ట్విస్టులు ఏమి లేనప్పటికి అందరూ లవర్స్ మాదిరిగా తాము కూడా పలు సందర్భాల్లో ఎంజాయ్ చేశామని అన్నారు చరణ్. మరోవైపు ఉపాసన కూడా చరణ్ మంచి అభిరుచి గల ప్రేమికుడిని, తనని మాత్రమే కాక తన ఆలోచనలు అర్ధం చేసుకునే అటువంటి వ్యక్తి తనకు లైఫ్ పార్టనర్ గా దొరకడం తన అదృష్టం అంటూ పలు సందర్భాల్లో ఉపాసన కూడా చరణ్ ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.