ఏంటి నిజమే : పొంగల్ మూవీస్ ప్లేస్ లో రాజుగారి అబ్బాయి మూవీ ... ??

GVK Writings
మరికొద్దిరోజుల్లో రానున్న సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఇప్పటికే పలు టాలీవుడ్ పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 7న రిలీజ్ కానుండగా ఇందులో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ మూవీ పేట్రియాటిక్ సినిమాగా భారీ యాక్షన్, విజువల్ వండర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఇక దీని తరువాత జనవరి 14న ప్రభాస్, పూజా హెగ్డే ల భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ కుమార్ తీసిన ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ కృష్ణంరాజు ఒక కీలక పాత్ర చేయగా ఇతర పాత్రల్లో సచిన్ ఖేడేకర్, జయరాం, మురళీశర్మ, భాగ్యశ్రీ తదితరులు కనిపించనున్నారు. వీటితో పాటు నాగార్జున, నాగచైతన్యల కలయికలో కళ్యాణ్ కృష్ణ తీస్తున్న బంగార్రాజు మూవీ కూడా జనవరి 15న విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం మన దేశంలో వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఉడడంతో పలు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ విధించడంతో ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ పొంగల్ బాక్సాఫీస్ రేస్ నుండి తప్పుకునే ఛాన్స్ గట్టిగా కనపడుతోందని అంటున్నారు.
ఒకవేళ అదేకనుక జరిగితే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా, ఆయన తమ్ముడు శిరీష్ కుమారుడైన ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరోవైపు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ కి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అధికారిక ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉందని, ఒకవేళ అదే జరిగితే రౌడీ బాయ్స్ మూవీ పక్కాగా సంక్రాంతి కానుకగా ఈనెల 7న రిలీజ్ అవుతుందని అంటున్నారు. కాగా రౌడీ బాయ్స్ మూవీని యువ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి మంచి లవ్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా తెలియాలి అంటే కొంత సమయం వరకు ఓపిక పట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: