శర్వానంద్ కు ఈ సారి హిట్ దక్కేలనే ఉంది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు,  ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్న శర్వానంద్  ప్రస్థానం, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, శతమానం భవతి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా వరుస విజయాలతో  టాలీవుడ్ లో ఫుల్ క్రేజీ హీరోగా మారిన శర్వానంద్  గత కొన్ని రోజులుగా పరాజయాలతో డీలా పడిపోయాడు, పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం లాంటి వరుస పరాజయాలతో శర్వానంద్ బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయాడు.

ఇలాంటి సందర్భం లోనే ఈ హీరో తాజాగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం, ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది, అలాగే శర్వానంద్ కు తల్లిగా ఈ సినిమాలో అమల నటించింది, ఈ సినిమాలో శర్వానంద్ కు ఫ్రెండ్స్ గా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ నటించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. శర్వానంద్ నటిస్తున్న తొలి బైలింగ్వల్ సినిమా ఇది, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. ఆర్. ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదిత్య 369` తరహాలో సైన్స్ ఫిక్షన్ గా ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఓ గమ్మత్తైన కథ కథనాలతో ఈ మూవీ సాగిపోతుంది. ఈ సినిమా ద్వారా శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు,  తాజాగా విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలుగజేసిన ఈ సినిమా ఫిబ్రవరిలో రెండు భాషల్లో విడుదల కాబోతుంది.  కొత్త కథ డ్రీమ్ వారియర్ సినిమాపై ప్రేక్షకుల కున్న నమ్మకం.. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు జడ్జిమెంట్, టైమ్ మెషీన్ నేపథ్యం,  టీజర్ కు లభిస్తున్న అనూహ్య స్పందన వెరసి ఈ మూవీ తో శర్వానంద్ బ్లాక్ బాస్టర్ హిట్ ను దక్కించుకునే లానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: