నిర్మాతలకు RRR సినిమాతో నష్టమేనా..ఎన్ని కోట్లంటే..?

Divya
ఏకంగా రూ. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు అభిమానులు , సినీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే జక్కన్న బాహుబలి సినిమా తర్వాత అంతే రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది వరకే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ కు అలాగే ఎన్టీఆర్ కు సంబంధించిన ఫోటోలను, టీజర్లను, ఫైట్ సీన్ లను ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించి కొన్ని క్రేజ్ పెంచే సన్నివేశాలను విడుదల చేయడంతో అటు నందమూరి అభిమానులు .. ఇటు మెగా అభిమానులు వాటిని చూసి ఖుషీ అవుతున్నారు.
ఇకపోతే సినిమా మేకర్స్ సృష్టించిన బీభత్సం అభిమానులలో మరింత హైప్ ను పెంచింది.. ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా..? ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా చూడాలా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే సినీ ప్రేక్షకులలో ఉన్నంత ఉత్సాహం , కోలాహం సినీ మేకర్స్ కు లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే టికెట్లు రేట్లను భారీగా తగ్గించడంతో.. నిన్నటికి నిన్న ఒక టికెట్ రేట్లు నిర్ణయించి వాటిని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సినిమా మేకర్స్. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న టికెట్ రేట్ లో గొడవ అలాగే మరో వైపు విజృంభిస్తున్న ఒమిక్రాన్ ను దృష్టిలో పెట్టుకుంటే.. సినిమా థియేటర్లకు వచ్చి సినిమా చూసే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని నిర్మాతలు తీవ్రంగా నిరాశ చెందడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా విడుదల అవ్వక ముందే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు కొనుగోలు చేసిన మొత్తంలో 50 నుంచి 60 శాతం తగ్గించాలని ఏపీ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే పెద్ద పెద్ద థియేటర్లు ఈ సినిమా వల్ల నష్టాన్ని ఎదుర్కోవడంతో పాటు చిన్న చిన్న థియేటర్లు కూడా భారీగా నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా వల్ల నిర్మాతలకు నష్టమే మిగులుతుందని అది కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని సినీ ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను  దృష్టిలో పెట్టుకొని సినిమా నిర్మాతలు ఈ సినిమాను విడుదల చేస్తారో లేదో అనే భయాందోళనలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: