అనుపమ నో మేకప్ ఫోటోలు చూశారా.. ఇలా ఉందేంటి?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీల కు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంటుంది. అందుకే వారు ఏదైనా పోస్ట్ చేశారు అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినిమా హీరోయిన్ హాట్ హాట్ ఫోటో షూట్ లకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాకుండా ఫుల్ మేకప్ వేసుకొని  కుందనపు బొమ్మలా తయారైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. మరికొంతమంది తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను పోస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ సినిమా హీరోయిన్స్ చాలా మటుకు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు
 పోస్ట్ చేయడానికి ధైర్యం చేయరు. సినిమాల్లో మేకప్ తో ఎంతో అందం గా కనిపించి అభిమానులను ఆకర్షించే హీరోయిన్లు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తే అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో  అని భావించి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు.

 కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ నిజమైన ముఖాన్ని అభిమానులకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకోవడం చేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటిదే చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పలుమార్లు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఇటీవల టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కూడా మేకప్ లేకుండా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో హీరోయిన్ గా అవతారమెత్తింది.

 ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ అనుపమ మాత్రం సరైన సార్ డమ్ అందుకోలేకపోయింది. తన అందం అభినయంతో ఎంతోమంది యువతని ఆకర్షించి హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. కానీ ఎందుకొ సినిమా అవకాశాలు అందుకోలేక తెలుగు తెరపై క్రమ క్రమంగా కనుమరుగవుతోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు పోస్ట్ చేసింది. ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది. ఫోటో చూసిన తర్వాత మేకప్ మేకప్ లేకుండా కూడా అనుపమ అంతే అందంగా ఉంది అని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. మేకప్ వేసుకుంటే కుందనపు బొమ్మలా ఉండే అనుపమ మేకప్ లేకుండా ఇలా ఉంది ఏంటి అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: