హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021 : ఓట్ట్ లో రిలీజైన సినిమాల లెక్క ఇది..!

shami
ఈ ఇయర్ మొదట్లో కరోనా కొద్దిగా గ్యాప్ ఇవ్వడంతో మళ్లీ సినిమాలు వెండితెర మీద పడ్డాయి. అయితే సెకండ్ వేవ్ వల్ల కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ప్రేక్షకులకు ఎలాగైనా ఎంటర్టైన్ అందించాలనే ఉద్దేశంతో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఈ ఇయర్ ఓటీటీలో కూడా భారె సినిమాలు రిలీజ్ అయ్యాయని చెప్పొచ్చు. ఓటీటీ రిలీజైన కలక్షన్స్ లెక్క తెలియదు కాని సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిందా లేదా అన్నది మాత్రం తెలుస్తుంది.
ఈ ఇయర్ లో ఓటీటీలో రిలీజైన క్రేజీ సినిమాలని చూస్తే.. విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాలు ఒకటి నారప్ప.. రెండు దృశ్యం 2 రెండు ఓటీటీ లో రిలీజ్ అయ్యాయి. తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ రీమేక్ గా వచ్చిన నారప్ప.. మళయాళ దృశ్యం 2కి రీమేక్ గా చేసిన దృశ్యం 2 అమేజాన్ ప్రైం లో రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలతో వెంకటేష్ మరోసారి రీమేక్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక ఓటీటీలో ఈ ఇయర్ సూపర్ హిట్ అయిన మరో బొమ్మ జై భీం. సూర్య నటించి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
లవర్ బోయ్ నితిన్ నటించిన మ్యాస్ట్రో డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైంది. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక అనసూయ థ్యాంక్యు బ్రదర్, సినిమాబడి, బట్టల రామస్వామి బయోపిక్కు ఓటీటీ ఆడియెన్స్ ను అలరించాయి. ఇక నాని నటించిన టక్ జగదీష్ ఎన్నో పరిణామాల మధ్య ఓటీటీ రిలీజైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. రాజ్ తరుణ్ పవర్ ప్లే కూడా ఓటీటీలో వచ్చింది. యువ హీరో సంతోష్ శోభన్ ఏక్ మిని కథ ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టెసింది. శివాని రాజశేఖర్ అద్భుతం, డబల్యు. డబల్యు.డబల్యు, సుహాస్ ఫ్యామిలీ డ్రామా. సత్య వివాహ భోజనంబు, నవీన్ చంద్ర సూపర్ ఓవర్, చిల్ బ్రో, అవసరాల శ్రీనివాస్ తో ప్రియదర్శి కలిసి నటించిన అన్ హార్ట్, సముద్రఖని నటించి ఆకాశవాణి, కార్తీక్ రత్నం అర్ధ శతాబ్ధం ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: