అమ్మో.. అనూ నీలో చాలా ఫైర్ ఉంది..

Satvika
బుల్లి తెరపై తన క్రేజ్ ను పెంచుకునేందుకూ మరింతగా  అలరిస్తున్న యాంకర్స్ ల లో ఒకరు జబర్దస్త్ అనసూయ. ఈమెకు పెళ్ళి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ అమ్మయిగారు మాత్రం యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు.. తన డ్రెస్సులు యువతకు కనుల విందు. సోషల్ మీడియా లో అనుకి విపరీతమైన ఫాలొయింగ్ ఉంది. అను కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన తాజా ఫోటో లను అభిమానుల తో పంచుకొనెది. వాటికి వచ్చే కామెంట్స్ ను ఎంజాయ్ చేసేది.

ఒక్కోసారి అనుకు కోపం తెప్పించెలా అభిమానులు మాట్లాడిన, కామెంట్లు చేసిన వారికి ఘాటు రిప్లై ఇస్తూ వస్తుంది.. కొన్ని కామెంట్లపై అమ్మడు అస్సలు స్పందించదు. తనని ఉద్దేశించి చేసే వీడియోలకు అసభ్యకరమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని అనసూయ తెలిపింది. అనసూయ లావైపోయింది, అనసూయ షాకింగ్ లుక్ అంటూ ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెడుతారు.. ఇలా లావు అవ్వడం తగ్గడం అనేది నా వ్యక్తి గత విషయం అంటూ ధ్వజమెత్తారు...

ఇండస్ట్రీలో ఎదుగుథున్న వారికి ఇలాంటివి కామన్. నేను పెద్దగా పట్టించుకోలేదు. అలా వదిలేస్తున్న కొద్ది రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. నాకు కూడా వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా అని అనసూయ పేర్కొంది. యూట్యూబ్ ఛానల్స్ వారి దిగజారుడు తనాన్ని ఎలా సపోర్ట్ చేస్తాయి.. ఇలా చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్న ఎవరూ పట్టించుకోరు.. ఇది బాధాకరమైన విషయం.అని అను అంది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడు  తెలుగు తో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. అనసూయకు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి అమ్మడు సినిమా లపై ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. అక్కడ ఎలా రానిస్తుందొ చూడాలి.. 
తాజాగా అనూ నటించిన చిత్రం పుష్ప.. ఎంత ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: