తమన్నా తన కెరియర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ తమన్నా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్ సరసన నటిస్తోంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో కూడా తమన్నా ప్రేక్షకులను అలరిస్తుంది, ఇలా తమన్నా ప్రస్తుతం సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, టీవీ షో లతో బిజీగా సమయం గడిపేస్తుంది, అలా ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సినిమా కథ నచ్చకో లేక మరే ఇతర కారణాల వల్ల కానీ కొన్ని సినిమాలకు నో చెప్పింది, అలా తమన్నా వదిలేసిన కొన్ని సినిమాల గురించి మనం తెలుసుకుందాం.
తేజ - వెంకటేష్ మూవీ( ఈ మూవీ అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోయింది).
అఖండ- నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాకు తమన్నా నో చెప్పింది.
స్పైడర్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన స్పైడర్ సినిమా కు కొన్ని కారణాల వల్ల తమన్నా నో చెప్పింది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమాకు తమన్నా నో చెప్పింది.
రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కొన్ని కారణాల వల్ల తమన్నా నో చెప్పేసింది.
నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాకు కొన్ని కారణాల వల్ల తమన్నా నో చెప్పింది.
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన శివమ్ సినిమాకు కూడా తమన్నా నో చెప్పేసింది.
ఓంకార్ దర్శకత్వం లో తెరకెక్కిన రాజుగారి గది త్రీ సినిమా తమన్నా నో చెప్పేసింది.
బెల్లంకొండ  శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన స్పీడున్నోడు సినిమాలో మొదటగా తమన్నా ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ చివరగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది.
సచిన్ హీరోగా తెరకెక్కిన ఆషికి 2 రీమేక్ సినిమాకు తమన్నా నో చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: