మెగాస్టార్ గాడ్ ఫాదర్ కోసం.. సల్మాన్ ఖాన్ ఎన్నిరోజులంటే..!

shami
బాలీవుడ్ కండల వీరుడు.. బాక్సాఫీస్ బాద్షా సల్మాన్ ఖాన్ ఇప్పుడు తెలుగు చల చిత్ర పరిశ్రమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ సినిమాలు బాలీవుడ్ లో మంచి ఫలితాలు అందుకోవడం వల్ల అక్కడ హీరోలకు సౌత్ మార్కెట్ మీద ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద ఆసక్తి కలిగింది. అందుకే అదివచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తెలుగులో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఎన్నిరోజులు పనిచేస్తున్నారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ 15 రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ 15 రోజుల్లోనే సల్మాన్ తో ఉన్న సీన్స్ అన్ని షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ చిరు సినిమాలో నటించడం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చ్ను. తప్పకుండా సల్మాన్ ఖాన్ తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరు పక్కన సల్మాన్ ఖాన్ అసిస్టంట్ గా నటిస్తుండటం విశేషం.  బాలీవుడ్ హీరో సల్మాన్ ఇన్నేళ్లకు మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా అదికూడా మెగాస్టార్ చిరుతో చేయడం తెలుగు ఆడియెన్స్ ను థ్రిల్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా విక్టరీ వెంకటేష్ తో కూడా సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు సంబందించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: