ఐటమ్ సాంగ్స్ లపై హీరోయిన్లు ఇంట్రెస్ట్.. అందుకేనా?

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమ లో చినా కథ ఎంత బాగా ఉన్నా కూడా అందులో పాటలు, మాటలు, మ్యూజిక్ అందరికి నచ్చుతాయి. అవి హిట్ టాక్ అందుకుంటే సినిమాలు ఘన విజయాన్ని అందుకుంటాయి. ఐటమ్ సాంగ్స్ లలో నటించే ముద్దు గుమ్మలు వేరే ఉంటారు. సినిమా లలో కనిపించేది 5 నిమిషాలు అయితే వారికి ఉన్న డిమాండ్ కూడా ఎక్కువే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లలో దుమ్ము రేపుతున్నాయి.

ఇటీవల చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా ఫెమస్ అయ్యారు. తమన్నా, శ్రేయ, శృతి హాసన్,పాయల్ ఇలా చాలా మంది ఐటమ్ సాంగ్ లు చేసి మంచి టాక్ ను అందుకున్నారు. అలా వాళ్ళు సినిమా లను వదిలి పాటలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని సినీ వర్గాల్లొ చర్చలు జరుగుతున్నాయి. సినిమా మొత్తం చేయడం కన్నా సినిమా లో ఒక్క పాట చేస్తె క్రేజ్ వస్తుంది. అలాగే కాసుల వర్షం కురుస్తుంది. ఇక నిర్మాతలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు.

అభిమానులు కూడా తమ ఇష్టమైన హీరోయిన్ అలా కనిపిస్తే చూడాలని ఆసక్తి కనబరుస్తున్నారు. మాములుగా సినిమా లో నటించడానికి 3 లేదా 6 కోట్లు తీసుకొనే ఈ ముద్దుగుమ్మ లు ఐటమ్ సాంగ్స్ లలో చేస్తె మాత్రం ఏకంగా 50లక్షల వరకూ వసూల్ చేస్తున్నారు. ఇలా సినిమాలు చేస్తూ ఇలా పాటలను చేయడం మొదలు పెట్టింది ముందు శ్రీయ శరన్.. దేవదాస్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించి విజిల్ వేయించుకుంది.. ఆమె శంఖుస్థాపన చేసింది వరుస పెట్టి మిగితా హీరోయిన్లు కూడా అదే ఫాలో అయ్యారు.మున్నా, తులసి లలో చేసింది. తర్వాత తమన్నా ఏకంగా నాలుగు సినిమాలు చేసింది. కాజల్, పూజా హెగ్డే, ఇప్పుడు సమంత కూడా ఐటమ్ సాంగ్స్ చెస్తున్నారు.. సినిమా తో సంబంధం లేకుండా బాగా సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: