ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసిన సినిమా ఆది. ఈ సినిమాను 2002 మార్చి 28న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఒక్కసారిగా పెంచింది. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఏకంగా 98 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ చిత్రంతోనే వివి వినాయక్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమైయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన వినాయక్ ఆదితో దర్శకుడిగా మరి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి వరకు ఈవీవీ సత్యనారాయణ - సాగర్ - క్రాంతి కుమార్ లాంటి సీనియర్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ తరుణంలోనే తాను దర్శకుడు అవ్వాలని ఒక కథను కూడా రెడీ చేసుకుని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి ) బ్యానర్లో సినిమా తీయాలని డిసైడ్ అయ్యారంట. నిజానికి ఆది సినిమా ముందు బాలకృష్ణతో తీయాలని వినాయక్ ఆ కథ రెడీ చేశారంట.
అయితే వినాయక్‌ అనుకున్న కథలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారని.. అందులో బాలకృష్ణ తమ్ముడు చిన్నప్పుడు విలన్ పై బాంబులు విసురుతాని రాసుకొచ్చారంట. ఇక ఆ తరువాత పెద్ద బాలకృష్ణ పోలీస్ అయ్యాక అనుకోకుండా తన తమ్ముడిని కొట్టాల్సి వస్తుందని ఆ కథలో టాటా సుమోలు గాల్లోకి ఎగురుతాయని ముందుగా వినాయక్ బాలయ్య కోసం కథ రాసుకొచ్చారంట.
ఇక అనూహ్యంగా ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి రావడంతో.. తాను ముందుగా బాలయ్య కోసం రాసుకున్న కథలోని చిన్నపిల్లాడు విలన్లపై పరిగెత్తుకుంటూ బాంబులు విసిరే సీన్. టాటా సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ ఆది సినిమా కోసం వాడుకుని కథను మార్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక చివరికి ఈ సినిమా ఎన్టీఆర్ తో చిత్రీకరించారు. ఈ సినిమా తరువాత వినాయక్ తన రెండో సినిమానే బాలయ్యతో చెన్నకేశవరెడ్డి చిత్రీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: